Ganguly: ఇంగ్లండ్‌లో గంగూలీకి అరుదైన గౌరవం
Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గంగూలీకి అరుదైన గౌరవం లభించింది. గంగూలీని బ్రిటిష్ పార్లమెంట్ సత్కరించింది. ఈ విషయాన్నిబీసీసీఐ అధ్యక్షుడే స్వయంగా వెల్లడించాడు. బ్రిటిష్ పార్లమెంటు తనను సత్కరించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ సన్మానం కోసం ఆరు నెలల కిందటే తనను సంప్రదించిందని వెల్లడించాడు. బ్రిటిష్ పార్లమెంట్ ప్రతి ఏడాది ఒకరిని ఇలా గౌరవిస్తుందని ఈ సారి తనకు ఆ అవకాశం లభించిందని సౌరవ్ గంగూలీ తెలిపాడు.
2002లో జులై 13వ తేదీన జరిగిన నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో గంగూలీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అదే జోరు.. అదే లండన్ నగరంలో గంగూలీకి సన్మానం జరగడం విశేషం. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న గంగూలీ.. 20 ఏళ్ల కిందట ఇంగ్లండ్ జట్టును వారి గడ్డపై ఓడించడం తన కెరీర్లో గొప్ప సందర్భాల్లో ఒకటని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత టీమిండియా కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేస్తోందన్నాడు. ఇప్పటికే టీ20 సిరీస్ గెలిచిన రోహిత్ సేన, మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.