IPL: ఐపీఎల్‌పై అక్కసును వెల్లగక్కిన పాక్ మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించి రానున్న ఐదు సంవత్సరాలు మీడీయా హక్కుల కోసం పలు ప్రాంచైజీలు పోటీపడడం, దీంతో చివరికి 5 సంవత్సరాలకు గాను ఏకంగా 48 వేల 390 కోట్ల రూపాయలకు మీడియా హక్కులు అమ్ముడుపోవడంతో ఐపీఎల్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టోర్నమెంట్‌గా నిలవడంతో పాకిస్థాన్ క్రికెటర్లకు మింగుడుపడడంలేదు. దీనిపై ఆ దేశ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. బీసీసీఐ భారత దేశంలో క్రికెట్‌ను క్రీడలా చూడటం లేదని, దానిని వ్యాపారంలా మార్చారని విమర్శించాడు. ఐపీఎల్ అంటేనే వ్యాపారం అన్నాడు.
ఇది సరైన పద్ధతి కాదని, బీసీసీఐ కొనసాగిస్తున్న టోర్నమెంట్ నాణ్యమైన క్రికెట్ కాదన్నాడు. భారత క్రికెట్ అభిమానులను పిలిచి.. క్రికెట్ ఎన్ని గంటలు చూస్తారని అడగాలని, దానిపై అభిమానులు ఎమంటారో తెలుస్తుందన్నారు. ఐపీఎల్‌కు భారీ విలువ ఉందని చెబితే అది కచ్చితంగా వ్యాపారమే అవుతుందన్నారు. ఈ వ్యాపారం ఎంత కాలం కొనసాగుతుందో చూడాలంటూ లతీఫ్ తన అక్కసు వెళ్లగక్కాడు. ఇంతకుముందు షాహిద్ అఫ్రిది సైతం భారత టీ20 లీగ్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. భారత్‌లో క్రికెట్‌కు మంచి మార్కెట్ ఉందని, దీంతో ఆదాయం బాగుందని అన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ ఏది చెబితే అది చెల్లుతుందంటూ భారత క్రికెట్‌పై నోరుపారేసుకున్నాడు షాహిద్ అఫ్రిది