భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2011 వన్డే ప్రపంచకప్ భారత్ గెలిస్తే ఆ క్రిడిట్ అంతా అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకే దక్కిందన్నారు. టీంలోని 11 మంది ప్లేయర్లు కలిసి ఆడితేనే జట్టు ట్రోపీని గెలిచిందన్నారు. టోర్నీలో సెమీస్‌లో ఆస్ట్రేలియాపై యువరాజ్ సింగ్ ఏం చేశాడు, ఫైనల్ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ ఏం చేసినట్లు అని హర్భజన్ అన్నాడు.
ఎప్పుడూ ఒక్కడికే క్రెడిట్ ఇస్తున్నారన్నారు. ధోనీ ఒక్కడే టోర్నీలో పాల్గొనలేదని, ధోనీతో పాటు మరో 10 మంది ఆటగాళ్లు కూడా టోర్నీలో పాల్గొన్నారని గుర్తు చేశాడు. ధోనీ ఒక్కడే మ్యాచ్ ఆడితే మిగతా 10 మంది కుర్చీలో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి వెళ్లామా అని ప్రశ్నించారు. క్రికెట్ అనేది ఒక టీమ్ గేమ్ అన్న బజ్జీ.. గెలిచినా.. ఓడినా అందులో అందరి పాత్ర ఉంటుందని పేర్కొన్నారు.