India Vs South Africa: అండర్ 19 మహిళా వరల్డ్ కప్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
First ever women under 19 Cricket world Cup in South Africa from today
మహిళా క్రికెట్ కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. దీంతో ఐసీసీ మరింత ఫోకస్ పెంచింది. మొట్ట మొదటి సారిగా అండర్ 19 మహిళా ప్రపంచ కప్ నిర్వహిస్తోంది. ఈ రోజు నుంచే పోటీలు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో భారత జట్టు సౌతాఫ్రికా జట్టుతో తలపడనుంది. సెఫాలీ వర్మ భారత జట్టుకు సారధ్యం వహిస్తోంది.
అండర్ 19 ప్రపంచ కప్ పోటీలు భారత దేశంలో టెలికాస్ట్ కావడం లేదు. ఫ్యాన్ కోడ్ అనే స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఈ మ్యాచులను స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ రోజు సాయంత్రం 5.15 నిమిషాలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. బెనోనీలో విల్లోమూర్ పార్క్ లో తొలి మ్యాచ్ జరగనుంది.
గత ఏడాది భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వచ్చిన సమయంలోను ఫ్యాన్ కోడ్ స్ట్రీమింగ్ ఇచ్చింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లకు చెందిన మ్యాచులను ఫ్యాన్ కోడ్ అనేక టోర్నీల సందర్భంగా స్ట్రీమింగ్ చేసింది
భారత మహిళా జట్టులో గతంలో అనేక మ్యాచులు ఆడిన షెఫాలీ శర్మ భారత జట్టుకు సారధ్యం వహిస్తుండగా, మరో సీనియర్ ప్లేయర్, వికెట్ కీపర్ అయిన రిచా ఘోష్ కూడా అండర్ 19 జట్టులో స్థానం సంపాదించింది. భారత తరపున ఆడేందుకు సిద్ధమయింది.
సౌతాఫ్రికాలో మొత్తం 16 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 16 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 41 మ్యాచులు జరగనున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఫ్యాన్ కోడ్ దక్కించుకుంది. మ్యాచులన్నింటినీ స్ట్రీమింగ్ చేయనుంది. సౌతాఫ్రికాలోని రెండు నగరాల్లో ఉన్న నాలుగు స్టేడియంలు వరల్డ్ కప్ పోటీలకు వేదిక కానున్నాయి. రువాండా, ఇండోనేషియా జట్లు ఈ వరల్డ్ కప్ ద్వారా క్రికెట్ రంగంలోకి అరంగేట్రం చేస్తున్నాయి.
మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలకం, అమెరికా జట్లు ఉన్నాయి గ్రూప్ బి లో ఇంగ్లండ్, పాకిస్తాన్, జింబాబ్వే, రువాండా జట్లు ఉన్నాయి. గ్రూప్ సి లో ఐర్లాండ్, ఇండోనేషియా, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ డిలో టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, ఎమిరేట్స్, స్కాట్లాండ్ జట్టు ఉన్నాయి. జనవరి 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
The Women's Under 19 World Cup is starting today. It is 🇿🇦 v 🇮🇳 at 13:45 SA time. Our ladies haven't had a good run in the lead-up to the tournament, but this is when it really counts#U19T20WorldCup
— Werner (@Werries_) January 14, 2023
First ever ICC Under 19 Women's T20 World Cup starts 14th Jan🏏 pic.twitter.com/YnXGPqh4sF
— Habib Ahasan (@HabibAh45855977) January 12, 2023