Fifa World Cup 2022: స్విట్జర్లాండ్‌పై బ్రెజిల్ ఘన విజయం
Fifa World Cup 2022: ఫిఫా ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్ బ్రెజిల్ నాకౌట్‌లోకి దూసుకెళ్లింది. తమ తొలి మ్యాచ్‌లో సెర్బియాను చిత్తుచేసి ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ పని పట్టింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన గ్రూపు-జీ మ్యాచ్‌లో బ్రెజిల్ 1-0 తేడాతో స్విట్జర్లాండ్‌పై అద్భుత విజయం సాధించింది. కాస్మైరో(83ని) బ్రెజిల్‌కు సూపర్ గోల్ అందించాడు.
ఓవైపు గాయం కారణంగా స్టార్ స్ట్రైకర్ నెయ్‌మర్ లేకపోయినా..ఆ లోటు ఏమాత్రం లేకుండా బ్రెజిల్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. మొత్తంగా తొమ్మిదిసార్లు గోల్ లక్ష్యంగా దాడి చేసిన బ్రెజిల్ జట్టు ఒకసారి మాత్రమే సఫలమైంది. స్విస్ నాలుగు సార్లు గోల్ కు ప్రయత్నించి విఫలమైంది. ప్రత్యర్థి వ్యుహాలకు చిక్కకుండా స్కెచ్ వేస్తూ ప్లేయర్లను మారుస్తూ మ్యాచ్‌ను మరింత రసపట్టుగా మార్చింది. ఓవైపు స్విస్ జట్టు కూడా బ్రెజిల్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా దూకుడు ప్రదర్శించింది.
65వ నిమిషంలో వినిసియస్ జూనియర్ చేసిన గోల్‌ను రెఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో బ్రెజిల్‌కు నిరాశే ఎదురైంది. 73వ నిమిషంలో రాఫిన్హా, రిచర్లిసన్ స్థానాల్లో సబ్‌స్టిట్యూట్స్‌ను ఆడించారు. అయితే బ్రెజిల్ పట్టు వీడని ప్రయత్నాలకు ఆఖరి నిమిషంలో ఊరట లభించింది. వినిసియస్ అందించిన పాస్‌ను టాప్ కార్నర్ నుంచి కాసెమిరో చక్కటి వాలీతో బంతిని నెట్‌లోకి పంపడంతో స్టేడియం దద్దరిల్లింది. ఓవైపు తమ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది.