FIFA World Cup 2022: సెమీస్ బెర్తులు ఖరారు
FIFA World Cup 2022: ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పోటీలు తుది దశకు చేరుకుంటున్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో అనూహ్య విజయాలు నమోదు చేసుకున్నాయి. బ్రెజిల్‌కు క్రొయేషియా షాకిచ్చింది. అటు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మధ్య సాగిన పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఇక, స్విస్ అర్జంటైనా మధ్య జరిగిన పోటీ మరింత ఆసక్తికరంగా సాగింది. పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పాలి. ఆట ముగిసే సమయానికి 2-2 గా ఉండగా, ఆ తరువాత అదనపు సమయంలో షటౌట్‌లో 4-3 తేడాతో అర్జంటైనా విజయం సాధించి సెబీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఆ తరువాత పుంజుకొని టైటల్ ఫేవరేట్ గా దూసుకుపోతున్నది. అయితే, ఈ వరల్డ్ కప్‌లో సంచనాలు నమోదు చేసుకుంటున్న క్రొయేషియాతో అర్జంటైనా సెమీస్‌లో ఢికొనబోతున్నది. మరో సెమీస్‌లో ఫ్రాన్స్ జట్టు మొరాకోతో తలపడబోతున్నది.