Cricket: గమ్మత్తైన బౌలింగ్ యాక్షన్‌తో వార్తల్లోకి ఇంగ్లండ్ విలేజ్ క్రికెటర్
Bowling Action: ప్రపంచ క్రికెట్‌లో వినూత్న రీతిలో బౌలింగ్ చేసే ఆటగాళ్లను చూశాం. లసిత్ మలింగ, భారత పేసన్ జస్‌ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ పేసర్ సొహైల్ తన్వీర్‌ల బౌలింగ్ యాక్షన్ గమ్మత్తుగా ఉంటుంది. శ్రీలంక దిగ్గజ క్రికెటర్ మలింగ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కుడి చేత్తో బౌలింగ్ వేస్తుంటాడు. మరోవైపు టీమిండియా బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా తక్కువ రనప్‌తో వచ్చి ఒక చేతిని ముందుకు పెట్టి బౌలింగ్ చేస్తుంటాడు.
కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు చూడని బౌలింగ్ యాక్షన్‌తో వార్తల్లోకి ఎక్కాడు ఓ ఇంగ్లండ్ క్రికెటర్. అతని పేరు జార్జ్‌మెక్ మెనెమీ అతను ఇంగ్లండ్‌లో విలేజ్ క్రికెట్ ఆడుతుంటాడు. అతని బౌలింగ్ శైలి చూసి ఫ్యాన్స్‌తో పాటు క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. అతడు కుడి చేతి వాటం స్పిన్ బౌలర్. జార్జ్ అందరిలా పరుగెత్తుకొని రాకుండా క్రీజు దగ్గరే రనప్ చేయడం అతని ప్రత్యేకత. ముందుగా ఎడమ చేతిని పైకి లేపుతాడు. ఉన్న చోటనే రనప్ చేస్తున్నట్టు చేసి బంతి వేసి మైకాళ్లపై చేతులు పెట్టి చూస్తుంటాడు. అదే అతని బౌలింగ్ ప్రత్యేకత. తన బౌలింగ్ వీడియోను జార్జ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.