ఐపీఎల్: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు బ్యాడ్ న్యూస్. మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్రకటించింది. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన మిస్టర్ కూల్.. ఇప్పటి వరకు 204 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 121 విజయాలు సాధించింది. మరోవైపు ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాలుగు సార్లు టైటిల్ అందించాడు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై 9 సార్లు ఫైనల్‌కు చేరింది. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2022 సీజన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేసింది యాజమాన్యం.