Womens Premier League: బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
Womens Premier League: మహిళల ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (72), షఫాలీ వర్మ (84) అర్ధ శతకాలతో దూసుకుపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది.
అనంతరం 224 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఢిల్లీ బౌలర్ తారా నోరిస్ బంతితో విజృంభించింది. . కీలకమైన బ్యాటర్స్ హీథర్ నైట్ (34), ఎలిసే పెర్రీ (31) , దిశా కసత్(9), కనికా అహుజా (0), రీచా ఘోష్ (2)లను ఔట్ చేసింది తారా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ తొలి బోణి కొట్టింది. నాలుగు ఓవర్లలో 29 రన్స్ మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసింది. డబ్ల్యూపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి అసోసియేట్ ప్లేయర్ నోరిస్ రికార్డు సృష్టించింది.