IND vs SA: ఆ కారణంగానే ఓడిపోయాం..డేవిడ్ మిల్లర్
IND vsSA: మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది భారత్. భారత బౌలర్ల ధాటికి 99 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన డేవిడ్ మిల్లర్.. ఈ పరాజయం తీవ్రంగా నిరాశపరిచిందన్నాడు. పిచ్ కఠినంగా ఉండటంతోనే భారత్‌తో మూడో వన్డేలో ఘోర పరాజయం చవి చూసామని సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ డేవిడ్ మిల్లర్ అన్నాడు. వర్షం కారణంగా పిచ్‌పై కవర్లు కప్పి ఉంచడంతో బౌలర్లకు అనుకూలించిందని, బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారిందన్నాడు.
పిచ్ బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉంది. 99 పరుగులు చేసేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఈ ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సిరీస్‌ను ఇలాంటి పరిస్థితుల్లో ముగిస్తామని అస్సలు అనుకోలేదు. వికెట్ స్పిన్‌కు అనుకూలించడంతో పాటు పేస్‌కు కూడా సహకరించింది. వర్షం కారణంగా పిచ్‌పై కవర్లు కప్పి ఉంచడంతో కఠినంగా మారింది. జట్టుగా మేం కొన్ని విషయాల్లో మెరుగ్గానే రాణించాం. రాబోయే టీ20 వన్డేల్లో మా బెస్ట్ పెర్ఫామెన్స్‌ను కొనసాగిస్తున్నాం అని మిల్లర్ పేర్కొన్నాడు.