మ్యాచ్ పూర్తయిన తర్వాత కెప్టెన్ ధోనీతో పాటు సహచర ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కలిసి స్టేడియం చుట్టూ కలియతిరిగారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. టెన్నిస్ ర్యాకెట్ పట్టుకున్న ధోనీ బంతులను అభిమానులు ఉన్న వైపుకు కొట్టి వారికి అందజేశాడు. ఆ బంతులను అందుకున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
CSK team lap of honour in Chepak Stadium in Chennai
ఐపీఎల్ టోర్నీ లీగ్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే 61 మ్యాచులు పూర్తయ్యాయి. మరో 9 మ్యాచులు పూర్తయితే లీగ్ దశ ముగుస్తుంది. నాలుగు జట్లు ప్లే ఆఫ్ దశకు చేరుకుంటాయి. మరో మూడు మ్యాచులు ఆడడం ద్వారా ఫైనల్ బెర్తులు ఖరారు అవుతాయి. మే 28న ఐపీఎల్ ఫైనల్ జరగనుంది.
ఐపీఎల్ ఆడుతున్న 10 జట్లు లీగ్ దశలో 14 మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. చెన్నై జట్టు ఇప్పటికే 13 మ్యాచులు ఆడింది. 7 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా పోయింది. దీంతో సీఎస్కే జట్టు మొత్తం 15 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
లీగ్ దశలో 14 మ్యాచులు ఆడాల్సిన చెన్నై జట్టు ఇప్పటికే చెపాక్ స్టేడియంలో 7 మ్యాచులు ఆడేసింది. లీగ్ దశలో సొంత గడ్డపై చెన్నై జట్టుకు ఇదే చివరి మ్యాచ్. ప్లే ఆఫ్ ఆడే అవకాశం లభిస్తే మరోసారి ఇక్కడ ఆడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు యాజమాన్యం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. చెపాక్ స్టేడియంలో చివరి లీగ్ మ్యాచ్ ముగియండంతో అభిమానులను అలరించేందుకు నిర్ణయించింది. హోంగ్రౌండ్లో చివరి మ్యాచ్ పూర్తయిన తర్వాత ల్యాఫ్ ఆఫ్ ఆనర్ నిర్వహించింది.
ల్యాఫ్ ఆఫ్ ఆనర్
మ్యాచ్ పూర్తయిన తర్వాత కెప్టెన్ ధోనీతో పాటు సహచర ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కలిసి స్టేడియం చుట్టూ కలియతిరిగారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. టెన్నిస్ ర్యాకెట్ పట్టుకున్న ధోనీ బంతులను అభిమానులు ఉన్న వైపుకు కొట్టి వారికి అందజేశాడు. ఆ బంతులను అందుకున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఐపీఎల్ మ్యాచ్ కామెంటరీ చెబుతున్న భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం పరుగు పరుగును ధోనీ ఉన్న ప్రదేశానికి వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. గవాస్కర్ తన వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోడానికి ప్రయత్నించడంతో ధోనీ కొన్ని క్షణాల పాటు విస్మయానికి గురయ్యాడు. ఆటోగ్రాఫ్ ఇచ్చిన అనంతరం గవాస్కర్‌ను కౌగిలించుకున్నాడు.
"Players like MS Dhoni come once in a century"~ Sunil Gavaskar
📸 ~ @ChennaiIPL pic.twitter.com/UDsI2ddSQZ
— Chennai Super Kings Fans (@CskIPLTeam) May 15, 2023
అంతులేని అభిమానం
ధోనీ వయసు ప్రస్తుతం 42 సంవత్సరాలు. ప్రస్తుతం ధోనీ శరీరం క్రికెట్ ఆడేందుకు పూర్తిగా సహకరించకున్నా అభిమానుల కోసం, జట్టు యాజమాన్యం కోసం ఆడుతున్నాడు. ఇదే తన చివరి ఐపీఎల్ సీజన్ అని ధోనీ ఇప్పటికీ ప్రకటించలేదు. కోట్లాది మంది అభిమానులు, క్రికెట్ దిగ్గజాలు సైతం ధోనీ వచ్చే సీజన్ కూడా ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. ఎక్కువ మంది మాత్రం ఇదే ధోనీ చివరి ఐపీఎల్ సీజన్ అని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈ సీజన్లో ధోనీ ఆడిన ప్రతి మ్యాచ్ సమయంలోను విపరీతంగా అభిమానం కురిపించారు. లీగ్ దశలో చెన్నైలో ఆడిన 7 మ్యాచులతో పాటు ఇతర ప్రాంతాలలో జరిగిన మ్యాచుల్లోనూ ధోనీపై అంతులేని అభిమానం కనబరిచారు.
ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడతాడు- కాశీ విశ్వనాథ్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథ్ ధోనీ ఐపీఎల్ కొనసాగింపుపై తన అభిప్రాయం వెల్లడించారు. ధోనీ వచ్చే సీజన్లో కూడా ఐపీఎల్ ఆడతాడని తాను నమ్ముతున్నానని అన్నాడు. 2024లో కూడా ధోనీ సీఎస్కే తరపున ఆడతాడని, అభిమానులు ఇలాగే వచ్చి తమ జట్టుకు మద్దతు తెలిపాలని కోరాడు.
మోకాలి గాయం
మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. వికెట్ల మధ్య పరుగులు తీయడంలో ఇబ్బంవది పడుతున్నాడు. ఎప్పటికప్పుడు ఫిజియోల సాయం తీసుకుంటున్నాడు. అందుకే బ్యాటింగ్ చేయడానికి పెద్దా ఆసక్తి చూపడం లేదు. ఈ సీజన్లో చాలా సార్లు చివరి ఓవర్లోనే బరిలో దిగాడు. బ్యాట్ ఝుళిపించాడు. ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. కోల్‌కతా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ భారీ షాట్లు కొట్టలేకపోయాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నై జట్టు కేవలం 144 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఎటువంటి ఇబ్బంది లేకుండా లక్ష్యం చేరుకుంది. చెన్నై జట్టుపై విజయం సాధించింది.
CSK stars thanking the Chepauk crowd. pic.twitter.com/I8TMBc0ONg
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 15, 2023
"Players like MS Dhoni come once in a century"~ Sunil Gavaskar
📸 ~ @ChennaiIPL pic.twitter.com/UDsI2ddSQZ
— Chennai Super Kings Fans (@CskIPLTeam) May 15, 2023
MS Dhoni & CSK thanking the Chepauk crowd.
What a lovely video. pic.twitter.com/qEkTcg9P3s
— Johns. (@CricCrazyJohns) May 14, 2023