ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు వీరవిహారం చేశారు. ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశారు. పరుగుల వరద పారించారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవన్ కాన్వేలు 87 బంతుల్లో 141 పరుగుల పటిష్ట భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోర్ 141 పరుగులు ఉన్నప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. చేతన్ సకారియాకు దొరికిపోయాడు.
CSK Scored 223 runs against Delhi Capitals
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు వీరవిహారం చేశారు. ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశారు. పరుగుల వరద పారించారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవన్ కాన్వేలు 87 బంతుల్లో 141 పరుగుల పటిష్ట భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోర్ 141 పరుగులు ఉన్నప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. చేతన్ సకారియాకు దొరికిపోయాడు.
గైక్వాడ్ ఔటైన తర్వాత వచ్చిన శివం దుబే సిక్సర్ల వర్షం కురిపించాడు. 3 భారీ సిక్సర్లు బాదాడు. కేవలం 9 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. 18వ ఓవర్ చివరి బంతికి శివం దుబే ఔటయ్యాడు.
ధోనీ ఎంట్రీ
శివం దుబే మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. అప్పటికే చెన్నై జట్టు స్కోర్ 195 పరుగులకు చేరుకుంది. ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తింది. అభిమానులు కేరింతలతో ధోనీకి స్వాగతం పలికారు.
కాన్వే ఔట్
ఓపెనర్‌గా వచ్చిన డెవన్ కాన్వే చెలరేగి ఆడాడు. 18 ఓవర్లు పూర్తయిన వరకూ బరిలో ఉన్నాడు. అప్పటికే 87 పరుగులు పూర్తి చేశాడు. నోకియా వేసిన 19వ ఓవర్లో భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి ఔటయ్యాడు. కాన్వే కేవలం 52 బంతుల్లో 87 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
జడేజా మెరుపులు
కాన్వే ఔటైన తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా మెరుపులు మెరిపించాడు. 7 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. 3 ఫోర్లు 1 సిక్సర్ బాదాదు. మహేంద్ర సింగ్ ధోనికి ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం రాలేదు. కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ధోనీ తక్కువ పరుగులే చేసినప్పటికీ అభిమానులు మాత్రం ధోనీని బ్యాటింగ్ చేస్తుండగా చూస్తూ మురిసిపోయారు.ఈ ఏడాది జరుగుతున్న టోర్నీలో చాలా మ్యాచుల్లో 7వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి దిగిన ధోనీ ఈ మ్యాచ్‌లో 4వ స్థానంలో బరిలో దిగాడు.
Innings Break!@ChennaiIPL post a dominating first-innings total of 223/3 in the first innings 🔥
Can @DelhiCapitals chase this down? We will find out 🔜
Scorecard ▶️ https://t.co/ESWjX1m8WD #TATAIPL | #DCvCSK pic.twitter.com/bE4jaCLf3G
— IndianPremierLeague (@IPL) May 20, 2023
.@Ruutu1331 continued his fine form in the season and scored a brilliant 79(50) 👌🏻👌🏻#TATAIPL | #DCvCSK
Sit back and relive his knock here 🎥🔽 https://t.co/jhktOS4GBJ pic.twitter.com/ZN9dyKEKQW
— IndianPremierLeague (@IPL) May 20, 2023