CSK in IPL Final: పదవ సారి ఫైనల్ లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ అయిదవ ఐపీఎల్ ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై అదరగొట్టింది. సొంత గడ్డపై అన్ని రంగాల్లో రాణించి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు 12వ సారి ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకుని రికార్డు సృష్టించింది. ధోనికి చివరి సీజన్ గా ప్రచారం నడమ తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు ధోనీ విజయాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ నెల 28న జరిగే ఫైనల్ లో ప్రత్యర్ధి కోసం ధోనీ సేన వెయిట్ చేస్తోంది.
ఐపీఎల్ ఫైనల్ లోకి మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ దూసుకు వెళ్లింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సొంతం చేసుకుని నేరుగా ఫైనల్ కి చేరింది. మరో ఫైనల్ ప్రత్యర్థి క్వాలిఫయర్ 2 మ్యాచ్ తో ఎవరు అనేది తేలబోతుంది. తొలి క్వాలిఫయర్‌లో ధోనీ సేన 15 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఛేదనలో తిరుగులేకుండా ఉన్న టైటాన్స్‌కు పరిస్థితులు అనుకూలించలేదు. మంచు ప్రభావం లేకపోవడంతో బౌలర్లదే ఆధిపత్యం కనిపించింది. మహేంద్ర సింగ్ ధోనీ ట్రేడ్ మార్క్ కెప్టెన్సీతో సీఎస్కే ఈ మ్యాచ్‌లో విజయాన్నందుకుంది. గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-2 ఆడనుంది. ఆ మ్యాచ్ లో ఫైనల్ లో చెన్నై ప్రత్యర్ధి ఎవరో తేలనుంది.
ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు 12వ సారి ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకుని రికార్డు సృష్టించింది. ఈ సారి ఐపీఎల్ ని గెలిచి సగర్వంగా ధోనీ వైదొలగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే జరగబోతుందని తాజా ఫలితాన్ని బట్టి అర్థం అవుతోంది. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ విజయాలు సొంతం చేసుకోకున్నా కూడా నిలకడగా ఆడుతూ ఫైనల్ వరకు చేరింది. ధోనీ ఈ టోర్నీ తరువాత ఒక వైదొలుగు తాడనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. తాను సీఎస్కేతోనే ప్రయాణం కొనసాగిస్తానని ధోనీ స్ఫస్టం చేసాడు. అహ్మదాబాద్ లో ఈనె 28న ఫైనల్ జరగనుంది. ఈరోజు జరిగే ఎలిమినేటర్ లో గెలిచే టీంతో 26న గుజరాత్ పోటీ పడనుంది. ఈ రోజు లక్నో వర్సస్ ముంబాయి మ్యాచ్ కూడా కీలకంగా మారుతోంది.
ఐపీఎల్ చరిత్రలో తొలి నుంచి చెన్నైది ప్రత్యేక స్థానం. అరంగేట్ర సీజన్ 2008లో రన్నరప్‌గా నిలిచిన ధోనీసేన.. 2009లో సెమీఫైనల్లో ఓడింది. 2010, 2011లో ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కే.. 2011, 2012లో రన్నరప్‌గా, 2014లో ప్లే ఆఫ్స్‌లోనే వెనుదిరిగింది. 2015లో మరోసారి రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు.. 2018లో టైటిల్ అందుకుంది. 2019లో మరోసారి రన్నరప్‌గా నిలిచిన సీఎస్కే 2021లో టైటిల్ ముద్దాడింది. ఈ సారి కూడా పాయింట్ల టేబుల్ లో రన్నరప్ గా క్వాలిఫయర్ ఆడిన చెన్నై ఇప్పుడు పదో సారి ఫైనల్ కు చేరింది. దీంతో, ఈ సారి కూడా చెన్నై ఛాంపియన్ గా అవతరిస్తుందనే అంచనాలు పెరిగిపోతున్నాయి. 2001లో రన్నరప్ గా నిలిచిన చెన్నై టైటిల్ విన్నర్ అయింది. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇప్పుడు మరోసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలో నిలిచింది. బలంగా కనిపించిన గుజరాత్ ను ధోనీ మాస్టర్ మైండ్ తో బోల్తా కొట్టించారు. ఇదే జోష్ కొనసాగితే ప్రత్యర్ధి ఎవరైనా ఫైనల్ లో గెలుపు ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి. అంతు చిక్కని సంచలనాకు చిరునామా అయిన ఐపీఎల్ లో చివరి వరకు ఏం జరుగుతుందనేది ఎప్పుడూ ఉత్కంఠే. మరి కింగ్స్ ఆల్వేస్ కింగ్స్ గా నిలుస్తాం..28న తేలనుంది.