VCA VDCA: విశాఖలో క్రికెట్ అభిమానులు అవస్థలు..ఇంకా అందని టిక్కెట్లు
Cricket fans angry on the organisers of the Cricket Match
విశాఖలో క్రికెట్ అభిమానులు అవస్థలు పడుతున్నారు. టిక్కెట్ల విషయంలో నిర్వాహకులు చేస్తున్న ఆలస్యానికి ఫ్యాన్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి టిక్కెట్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్న కారణంగా విశాఖలోని ఏసిఏ- వీడిసిఏ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు.
ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి స్టేడియం వద్ద టికెట్లు జారీ చేస్తారని నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. టెక్కెట్ల కోసం ఉదయం నుండి అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఉదయం నుండి లైన్ లలో పడిగాపులు కాస్తున్నా టిక్కెట్లు ఇంకా అందక పోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
రెండో వన్డేకి వరుణుడి గండం
భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోస్తాలో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. మ్యాచ్ జరిగే రోజు కూడా వర్షం పడే అవకాశం ఉందని పలు సంకేతాలు అందుతున్నాయి. మార్చి 19 న మ్యాచ్ జరిగే సందర్భంగా వర్షం పడకుండా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. చాలా కాలం తర్వాత వైజాగ్ నగరంలో వన్డే మ్యాచ్ జరగనుండడంతో అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం కలగడంతో ఎంతో సంతోషంగా ఉన్నారు.