Ishan Kishan: ఇషాన్ కిషన్‌పై ప్రశంసల వర్షం
Compliments to Double Centruy Hero Ishan Kishan
భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పకున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో డబుల్ సెంచరీ సాధించిన ఈ బ్యాటర్ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి దిగ్గజాల సరసన చోటు సంపాదించుకున్నాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల తర్వాత భారత్ తరపున డబుల్ సెంచరీ చేసిన మొనగాడిగా అవతరించాడు.
అతి చిన్న వయసులో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా కూడా ఇషాన్ కిషన్ రికార్డుల కెక్కాడు.
మొదటి 50 పరుగులు చేయడానికి 49 బంతులను ఎదుర్కొన్నాడు. 100 పరుగులు చేయడానికి 85 బంతులను ఆడాడు. 103 బంతుల్లో 150 పరుగులు చేసిన ఇషాన్ 126 బంతుల్లోనే 200 పరుగుల మైలురాయిని చేరాడు.
తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా చేయని ఇషాన్ కిషన్ ఏకంగా డబుల్ ఢమాకా సాధించి క్రికెట్ అభిమానులను అలరించాడు.
రోహిత్ శర్మకు తగిలిన గాయం ఇషాన్ కిషన్ క్రికెట్ జీవితాన్నే మార్చేసింది. రోహిత్ స్థానంలో బరిలో దిగిన ఇషాన్ ఎవ్వరూ ఊహించని విధంగా చెలరేగి ఆడాడు. స్టేడియాన్ని హోరెత్తించాడు. బౌండరీలు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. 210 పరుగుల వద్ద ఔటైన ఇషాన్ ఏకంగా 24 బౌండరీలు, 10 సిక్సర్లు బాదాడు. 36వ ఓవర్‌లో వెనుదిరిగాడు. 50 ఓవర్లు పూర్తయ్యే వరకు ఉండి ఉంటే ఖచ్చితంగా 300 పరుగుల మైలురాయిని కూడా చేరుకునే వాడే.
ఇషాన్ కిషన్ సాధించిన ఈ అరుదైన ఘనతను క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ట్విట్టర్ ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Ishan Kishan ⭐️⭐️⭐️⭐️⭐️ well played Champ #ishankishan @ishankishan51
— Harbhajan Turbanator (@harbhajan_singh) December 10, 2022
Partnership of 240. Kohli makes 60. It isn't often that the spectacular is happening at the other end! When on song, there are few more fearless and breathtaking batters then Ishan Kishan
— Harsha Bhogle (@bhogleharsha) December 10, 2022
Outstanding! Well done Ishu 💯💯😘 So so proud of you baby! Well deserved 👏👏 @ishankishan51 pic.twitter.com/r8cjynGEqD
— hardik pandya (@hardikpandya7) December 10, 2022
That’s the way to do it. Brilliant from Ishan Kishan. This is the approach that will do Team India a world of good. #INDvsBAN pic.twitter.com/PepchFwFF1
— Virender Sehwag (@virendersehwag) December 10, 2022
A fabulous knock! 💯
A fabulous knock! 💯The innings you played today deserves double the appreciation too @ishankishan51!
Wonderful knock by @imVkohli as well. Many congratulations! pic.twitter.com/XX4PByDEj2
— Sachin Tendulkar (@sachin_rt) December 10, 2022
I cannot put into words what I’m feeling right now but I’ll try. I’m overwhelmed by the love, the messages, the wishes. This is an innings that will stay in my heart forever, a day that I won’t forget, and these moments that I’ll always carry with me. Thank you for everything 🇮🇳 pic.twitter.com/xlNzuWxA4w
— Ishan Kishan (@ishankishan51) December 10, 2022