IPL2022: ఢిల్లీ క్యాపిటల్స్ మాచ్‌పై క్లారిటీ..
ఐపీఎల్‌లో కరోనా టెన్షన్ నెలకొంది. ఢిల్లీ క్యాపిటల్ జట్టులో మిచెల్ మార్ష్‌తో పాటు పలువురు సహాయ సిబ్బంది కరోనా బారిన పడటంతో మొదట ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రేపు పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొనగా.. రేపటి మ్యాచ్ యధావిధిగా జరుగుతుందని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తెలిపింది. ఐతే మ్యాచ్ వేదికను మార్చినట్లు తెలిపింది. రేపు ఢిల్లీ-పంజాబ్ జట్లు పూణే వేదికగా తలపడనుండగా.. మ్యాచ్ వేదికను పూణే నుంచి ముంబైకి మార్చినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు క్వారంటైన్‌లో ఉండగా.. వారికి డీసీ యాజమాన్యం మరోసారి కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించనుంది. ఈ టెస్ట్‌లో ఎవరికైనా పాజిటివ్ వస్తే మ్యాచ్ రీ షడ్యూల్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ జట్టులో ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్, ఆటగాడు మిచెల్ మార్ష్, స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్ చేతన్ కుమార్, డాక్టర్ అభిజిత్ సాల్వితో పాటు సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్ ఆకాశ్ మానేకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తెలిపింది.