చెన్నై సూపర్‌కింగ్స్.. పదోసారి ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది. బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 60 , డేవన్ కాన్వే 40 , జడేజా 22 పరుగులతో చెలరేగారు.
CSK vs GT : చెన్నై సూపర్‌కింగ్స్.. పదోసారి ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది. బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 60 , డేవన్ కాన్వే 40 , జడేజా 22 పరుగులతో చెలరేగారు. బ్యాటింగ్ తో పాటు బౌలర్లందరూ సమష్టిగా రాణించడంతో.. మంగళవారం జరిగిన క్వాలిఫయర్–1లో సీఎస్కే 15 రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచింది.పదోసారి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.ఛేదనలో తిరుగులేకుండా ఉన్న గుజరాత్ కు పరిస్థితులు అనుకూలించలేదు. మంచు ప్రభావం లేకపోవడంతో బౌలర్లదే ఆధిపత్యం కనిపించింది. అయితేఈ మ్యాచ్ లో ఓడిన గుజరాత్ కు శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ముందుగా చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది.
టార్గెట్ ఛేజింగ్‌లో గుజరాత్‌కు కలిసి రాలేదు. ఆరంభంలో గిల్, చివర్లో రషీద్ మెరుగ్గా ఆడినా.. సీఎస్కే పేస్–స్పిన్ కాంబినేషన్ దెబ్బకొట్టింది. పరుగుల ఛేదనలో గుజరాత్ ఆరంభం నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ సాహా 12 , కెప్టెన్ హార్దిక్ పాండ్య 8 , దసున్ శనక 17 , డేవిడ్ మిల్లర్ 4 తక్కువ స్కోరుకే ఔటైపోయారు. కానీ.. ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ శుభమన్ గిల్ 42 పరుగులతో నిలకడగా ఆడుతూ గుజరాత్ స్కోరు బోర్డుని నడిపించాడు. 14వ ఓవర్ తొలి బంతికే గిల్‌ను చాహర్ అవుట్ చేయగా, తెవాటియా 3 స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కానీ క్రీజులో ఉన్న విజయ్ శంకర్ , రషీద్ భారీ షాట్లతో చెలరేగారు. ఎట్టకేలకు అతడిని 19వ ఓవర్లో దేశ్‌పాండే అవుట్ చేయడంతోనే సీఎస్కే విజయ సంబరాల్లో మునిగింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన చెన్నై సూపర్‌కింగ్స్.. పదోసారి ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది.