Puaja Bowling: చివరి టెస్టులో చటేశ్వర పుజారా బౌలింగ్, అశ్విన్ ఏమన్నాడంటే…
Chateswara Puaja Bowling in the Fourth test
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాల్గవ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్ డ్రా కానుందని తెలియడంతో కెప్టెన్ రోహిత్ శర్మ చటేశ్వర పుజారాతో బౌలింగ్ చేయించాడు. పుజారాతో పాటు శుభ్మన్ గిల్ కూడా బౌలింగ్ చేశాడు. పుజారాతో బౌలింగ్ చేయిస్తున్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్ కొన్ని సరదా ఎక్స్ ప్రెషన్స్ పెట్టాడు.
ఇన్నింగ్స్ 77వ ఓవర్ శుభ్మన్ గిల్ బౌలింగ్ చేశాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, లబుషేన్ లిద్దరూ పరుగులు చేయలేకపోయారు. కేవలం ఒక్క పరుగు మాత్రమే గిల్ ఇచ్చాడు. గిల్ బౌలింగ్ పూర్తయిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ పుజారాకు బౌలింగ్ ఛాన్స్ ఇచ్చాడు. పుజారా కూడా తన ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు.
నేనేం చేయను, జాబ్ వదిలేయాలా?
మ్యాచ్ పూర్తయిన అనంతరం అశ్విన్ ట్విట్టర్ వేదికగా ఓ ఫన్నీ కామెంట్ చేశాడు. పుజారా బౌలింగ్ వేస్తున్న ఫోటోను ట్వీట్ చేస్తూ ఓ ఫన్నీ డైలాగ్ వదిలాడు. ఇక నుంచి నేనేం చేయను, జాబ్ వదిలేయాలా అని ప్రశ్నించాడు.
Main kya karu? Job chod du? 😂 pic.twitter.com/R0mJqnALJ6
— Ashwin 🇮🇳 (@ashwinravi99) March 13, 2023