కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో తనదైన ముద్ర వేశాడు. గత ఏడాది ఒక మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన రింకూ ఈ ఏడాది వీరవిహారం చేశాడు. ఒకవైపు క్రికెట్ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న రింకూ మరోవైపు నుంచి క్రికెట్ దిగ్గజాల నుంచి కూడా అదే స్థాయిలో అభినందనలు అందుకుంటున్నాడు
Chasing King Rinku Singh
కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో తనదైన ముద్ర వేశాడు. గత ఏడాది ఒక మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన రింకూ ఈ ఏడాది వీరవిహారం చేశాడు. ఒకవైపు క్రికెట్ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న రింకూ మరోవైపు నుంచి క్రికెట్ దిగ్గజాల నుంచి కూడా అదే స్థాయిలో అభినందనలు అందుకుంటున్నాడు. భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ రింకూ సింగ్ ఆటకు ఫిదా అయ్యారు. ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా యంగ్ క్రికెటర్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
Rinku Singh after the 17th over 24* (20).
Rinku after 20th over – 67* (33).
– One of the greatest ever performances in a losing cause. KKR lost by just 1 run. This was Rinku's season, take a bow! pic.twitter.com/fAewy8Mlhb
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2023
What a match… What a fight… Lone warrior Rinku Singh 👏 pic.twitter.com/EyOdaRHQW6
— Gujarat Titans (@Gujrat_titans_) May 20, 2023
What an effort by Rinku today! Sensational talent! pic.twitter.com/E2HmdeqiHJ
— Gautam Gambhir (@GautamGambhir) May 20, 2023
Rinku Singh is an epitome of “Never Give Up”. Phenomenal season and what an incredible life story. So happy that his hardwork has transformed into outstanding performances and the world has taken note of his talent and ability. Salute to his attitude and fighting spirit #KKRvsLSG pic.twitter.com/plxiolTSTh
— Virender Sehwag (@virendersehwag) May 20, 2023
Rinku Singh's 110 meter six aganist Naveen.
What a hit. pic.twitter.com/1MgiE4pJXX
— Johns. (@CricCrazyJohns) May 20, 2023
14 మ్యాచులు 474 పరుగులు
ఇప్పటి వరకు 14 మ్యాచులు ఆడిన రింకూ సింగ్ 474 పరుగులు చేశాడు. అందులో 4 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. ఆ నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఛేజింగ్ సమయంలో చేసినవి కావడం విశేషం. కేకేఆర్ జట్టు తరపున ఫినిషర్ రోల్ పోషిస్తున్న రింకూ సింగ్ ఏప్రిల్ 9న గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. రాత్రికి రాత్రే హీరోగా మారిపోయాడు. చివరి రెండు ఓవర్లలో 41 పరుగులు చేశాడు. జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్ చివరి 5 బంతులకు 5 సిక్సర్లు కొట్టి ఐపీఎల్ చరిత్రలో మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు.
ఛేజింగ్ కింగ్ రింకూ సింగ్
మే 20న లక్నో జట్టుతో ఆడిన మ్యాచ్‌లోనూ రింకూ సింగ్ మరోసారి తన సత్తా చాటాడు. ఛేజింగ్ కింగ్ అనిపించుకున్నాడు. చివరి రెండు ఓవర్లలో 36 పరుగులు చేశాడు. చివరి బంతి వరకు ఉత్కంఠ నెలకొనే ఇన్నింగ్స్ ఆడాడు. 19వ ఓవర్లో 20 పరుగులు చేసిన రింకూ 20వ ఓవర్లో 16 పరుగులు చేశాడు.
నవీన్ ఉల్హల్ వేసిన 19వ ఓవర్లో మొత్తం 6 బంతులనూ ఎదుర్కొన్న రింకూ సింగ్ 20 పరుగులు పిండుకున్నాడు. మొదటి మూడు బంతులకు మూడు ఫోర్లు సాధించిన రింకూ ఆ తర్వాత బంతికి 2 పరుగులు సాధించాడు. 5వ బంతిని సిక్సర్‌గా మలిచాడు. చివరి బంతికి ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో 19 ఓవర్లో 20 పరుగులు లభించాయి.
20వ ఓవర్ తొలి బంతిని ఆడిన కేకేఆర్ బ్యాటర్ వైభవ్ అరోరా సింగిల్ తీసి రింకూ సింగ్‌కు స్ట్రయికింగ్ అందించాడు. తాను ఎదుర్కొన్న మొదటి రెండు బంతులకు పరుగేలేమీ సాధించలేకపోయిన రింకూ చివరి మూడు బంతులను బౌండరీలకు తరలించాడు. నాల్గవ బంతికి సిక్స్ కొట్టిన రింకూ సింగ్ 5వ బంతిని ఫోర్‌గా మలిచాడు. ఇక చివరి బంతికి ఓ భారీ సిక్సర్ కొట్టి తన సత్తా చాటాడు. రింకూ సింగ్ పరుగుల వరద పారించినప్పటికీ కేకేఆర్ లక్ష్యం చేరుకోలేకపోయింది. 2 పరుగుల దూరంలో ఉండిపోయింది. ఒక్క పరుగు తేడాతో లక్నో జట్టు విజయం సాధించింది.