రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. బీజేపీ ఎంపీ కూడా అయిన బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ఎక్కడా తగ్గడం లేదు. రెజ్లర్ల ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. తాజాగా నార్కో టెస్టు కూడా తాను సిద్ధమని ప్రకటించారు. రెజ్లర్లు వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియాలు కూడా తనతో పాటు నార్కో టెస్టులు చేయించుకోవాలని షరతు విధించారు.
Brij Bhushan ready for Narco test, Wrestlers want it to be Live telecast
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. బీజేపీ ఎంపీ కూడా అయిన బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ఎక్కడా తగ్గడం లేదు. రెజ్లర్ల ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. తాజాగా నార్కో టెస్టు కూడా తాను సిద్ధమని ప్రకటించారు. రెజ్లర్లు వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియాలు కూడా తనతో పాటు నార్కో టెస్టులు చేయించుకోవాలని షరతు విధించారు.
నార్కో టెస్టు చేయించుకోవాలని బ్రిజ్ భూషన్ సవాలు విసరగా, ఆ సవాలును రెజ్లర్లు స్వీకరించారు. నార్కో టెస్టు చేసే క్రమంలో ఆ మొత్తం ప్రక్రియను లైవ్ టెలికాస్ట్ చేయాలని కోరారు. ఆలా చేస్తే బ్రిజ్ భూషన్ చేసిన అరాచకాలు దేశ వ్యాప్తంగా అందరికీ తెలుస్తుందని రెజ్లర్లు కౌంటర్ ఇచ్చారు.
రెజ్లర్లకు పెరుగుతున్న మద్దతు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన వినేష్ ఫోగట్ తదితరులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగారు. ఏప్రిల్ నెలలో ప్రారంభించిన దీక్షను ఇంకా కొనసాగిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్‌కు శిక్ష పడే వరకు పోరాటం కొనసాగిస్తామని రెజ్లర్లు తెగేసి చెబుతున్నారు. రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు దేశ వ్యాప్తంగా అనేక వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. హర్యానాకు చెందిన రైతులు కూడా వీరికి బాసటగా నిలిచారు. రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా రెజ్లర్లను కలిసి తన సంఘీభావం ప్రకటించారు.