IPL 2022: ఇవాళ బిగ్ ఫైట్
IPL 2022 సీజన్‌లో ఇవాళ బిగ్ ఫైట్ జరగనుంది రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 మ్యాచ్‌లు ఆడగా అందులో మూడు విజయాలు నమోదు చేయగా.. గుజరాత్ టైటాన్ సైతం ఆడిన నాలుగింట్లో మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రికార్డుపై కన్నేశాడు. ఇప్పటి వరకు 80 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రషీద్ 99 వికెట్ల తీశాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీస్తే ఐపీఎల్ టోర్నీలో 100 వికెట్లు తీసిన విదేశీ బౌలర్ల క్లబ్‌లో చేరనున్నాడు. 100 వికెట్లు తీసిన బౌలర్లలో శ్రీలంక పేసర్ లసిత్ మలింగ 170 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నడు