Jasprit Bumrah: బుమ్రాకు మరికొంత కాలం విశ్రాంతి, శ్రీలంకతో సిరీస్ నుంచి ఔట్
BCCI decided to give more rest to Jaspreeth Bumrah
భారత పేస్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. మరికొంత కాలం పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాతనే క్రికెట్ బరిలో దిగనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో బుమ్రా రీ ఎంట్రీ చేయనున్నాడని కొన్ని రోజుల క్రితమే బీసీసీఐ ప్రకటించింది. కొన్ని అనివార్య కారణాల కారణంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ఈ ఏడాదిలో వన్డే వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్‌లో బుమ్రాను తప్పనిసరిగా ఆడించేందుకు బీసీసీఐ పెద్దలు నిర్ణయించారు. చిన్న చిన్న టోర్నమెంట్లలో ఆడించకుండా జాగ్రత్త పడుతున్నారు.
గత ఏడాది ఆసియా కప్ ముందు గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. కొన్ని వారాల పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో కండిషనింగ్ క్యాంప్‌లో పాల్గొన్నాడు. కాస్త కోలుకున్నాడు. పూర్తి స్థాయిలో కోల్కోవడానికి ఇంకా మరింత సమయం విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ వైద్యులు చెప్పడంతో వన్డే సిరీస్‌లో ఆడించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం వన్డే జట్టులో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లు భారత బౌలింగ్ విభాగంలో ఉన్నారు.
గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 మ్యాచ్‌లో బుమ్రా ఆడాడు. అదే బుమ్రాకు చివరి మ్యాచ్. అప్పటి నుంచి విశ్రాంతిలోనే ఉన్నాడు.
శ్రీలంకతో ఆడనున్న భారత జట్టు
శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యార్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్