India Vs Australia: ఉస్మాన్ ఖవాజా ఉడుం పట్టు , 400 పరుగులు దాటిన ఆసీస్ స్కోర్
Australia scored 409 runs at the time of tea break on the second day
నాల్గవ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ జట్టు పట్టు బిగించింది. ఉస్మాన్ ఖవాజా ఉడుం పట్టు పట్టాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. క్రీజులో పాతుకుపోయాడు. టీ విరామ సమయానికి ఖవాజా 180 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరోవైపు కెమరున్ గ్రీన్ కూడా సెంచరీ సాధించి ఆసీస్ ఆధిపత్యానికి సహకరించాడు. 170 బంతుల్లో 114 పరుగులు చేశాడు. కెమరున్ గ్రీన్ చేసిన తొలి సెంచరీ ఇదే కావడం విశేషం.
వికెట్లు తీయడానికి భారత బౌలర్లు ఆపసోపాలు పడుతున్నారు. ఆట రెండో రోజు టీ విరామ సమయానికి ఆసీస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 409 పరుగులు చేసింది. రవిచంద్ర అశ్విన్ 4 వికెట్లు తీశాడు. షమీకి 2 వికెట్లు పడగొట్టాడు. జడేజా ఒక్క వికెట్ సాధించాడు. తొలి రోజున 4 వికెట్లు తీసిన భారత జట్టు రెండో రోజు వికెట్ల వేటలో వెనకబడింది. ఉస్మాన్ ఖాజా క్రీజులో పాతుకుపోయాడు. ఎంతో ఓపికతో ఆడుతున్నాడు. టెస్టు మ్యాచ్ ఎలా ఆడాలో చూపిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నాడు.
180 పరుగుల వద్ద ఖవాజా ఔట్
రెండో రోజు ఆటలో వికెట్లు తీయడంతో భారత బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉస్మాన్ ఖవాజా, కెమరున్ గ్రీన్ జోడీని విడదీశాడు. 378 పరుగుల వద్ద 5వ వికెట్ పడింది. అదే ఓవర్ చివరి బంతికి మరో వికెట్ పడగొట్టాడు. మరో 10 పరుగులు దాటిన తర్వాత మరో వికెట్ల పడగొట్టాడు. వరుసగా 3 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ అందించిన ఆ ఉత్సాహంతో మిగతా బౌలర్లు వికెట్ల వేట ప్రారంభించారు. భీకర ఫాంలో ఉన్న ఉస్మాన్ ఖవాజాను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. 180 పరుగుల వద్ద పెవిలియన్ కి పంపాడు.
Tea on Day 2 of the 4th Test @ashwinravi99 picks up three wickets in the second session as Australia are 409/7.
Scorecard – https://t.co/8DPghkwsO6 #INDvAUS @mastercardindia pic.twitter.com/Lt6dIgqP8r
— BCCI (@BCCI) March 10, 2023
Australia lose three wickets in the second session but Usman Khawaja continues his charge.#WTC23 | #INDvAUS | 📝 https://t.co/VJoLfVSeIF pic.twitter.com/6rGW7kkgVy
— ICC (@ICC) March 10, 2023