India Vs Australia: తొలి రోజు ఆసీస్ ఆధిపత్యం, క్వాజా అద్భుత సెంచరీ
Australia scored 255 runs in the First Day
తొలి ఇన్నింగ్స్ తొలి రోజున ఆస్ట్రేలియా జట్టు తన సత్తా చాటుకుంది. భారత జట్టుతో జరుగుతున్న నాల్గవ టెస్టు తొలి రోజున ఆధిపత్యం కనబరిచింది. మొదటి రోజు ఆట పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేశారు. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అద్భుత సెంచరీతో అలరించాడు. తొలి రోజు పూర్తయ్యే సమయానికి 104 పరుగుల వద్ద అజేయంగా ఉన్నాడు. ట్రావిస్ హెడ్ 32 పరుగులు చేయగా, కెప్టెన్ స్మిత్ 38 పరుగులు చేశాడు. కామెరున్ గ్రీన్ 49 పరుగుల వద్ద అజేయంగా ఉన్నాడు.
తొలి రోజు పడిన నాలుగు వికెట్లలో రెండు వికెట్లు షమీ తీయగా, అశ్విన్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్ వికెట్ దక్కించుకోలేకపోయాడు. తొలి వికెట్ అశ్విన్ దక్కించుకున్నాడు. రెండో వికెట్ షమీ దక్కించుకున్నాడు. అక్కడి నుంచి వికెట్లు రావడం కష్టంగా మారింది. స్మిత్, క్వాజాలు క్రీజులో పాతుకుపోయారు. వీరి భాగస్వామ్యం విడదీయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఆసీస్ స్కోర్ 151 పరుగులకు చేరుకున్న సమయంలో రవీంద్ర జడేజా వీరి భాగస్వామ్యానికి తెరదించాడు. స్మిత్ జోరుకు అడ్డుకట్టవేశాడు. 38 పరుగులకు ఇంటికి పంపాడు. ఆ తర్వాత వచ్చిన పీటర్ హ్యాండ్స్ కాబ్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు ఓపెనర్ క్వాజా మాత్రం చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో భారత బౌలర్లను ఎదుర్కొన్నాడు. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కామెరున్ గ్రీన్ క్వాజాకు జత కలిసిన తర్వాత ఆసీస్ మరింత పటిష్టంగా తయారయింది.
ICYMI – #TeamIndia's delightful breakthrough!@imjadeja breaks the partnership to get Steve Smith out 👌👌
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/lJVW7uzi9h
— BCCI (@BCCI) March 9, 2023
Stumps on Day 1️⃣ of the Fourth #INDvAUS Test!
2️⃣ wickets in the final session as Australia finish the opening day with 255/4 on board.
We will be back tomorrow as another action-packed day awaits💪
Scorecard ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/hdRZrif7HC
— BCCI (@BCCI) March 9, 2023