India Vs Australia: ఆధిక్యంలో ఆసీస్, తొలి రోజు ఆటముగిసే సమయానికి 47 రన్స్ లీడ్
Australia lead by 47 runs in the First Innings at the end of the First Day of Third test
మూడో టెస్టులో ఆసీస్ జట్టు ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి రోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా 60 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించాడు. ఆసీస్ జట్టును ఆధిక్యంలో నిలిపాడు. లబుషేర్ 31 పరుగులు, స్టీవ్ స్మిత్ 26 పరుగులు చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పీటర్ హ్యాండ్ కోమ్, కామెరన్ గ్రీన్ బరిలో నిలిచారు.
టీమిండియా 109 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టు 12 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. అక్కడ నుంచి ఆసీస్ బ్యాటర్లు, భారత్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు.
మొదటి వికెట్ సునాయశంగా సంపాదించిన టీమిండియా రెండో వికెట్ పడగొట్టడానికి ఆపసోపాలు పడింది. రవిచంద్రన్, అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు ఎంత ప్రయత్నించినా ఆసీస్ జోడీని విడగొట్టలేకపోయారు. చివరకు 108 పరుగుల వద్ద రవీంద్ర జడేజా రెండో వికెట్ పడగొట్టారు. అక్కడి నుంచి ఆట ముగిసే సమయానికి మరో రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టు 156 పరగులు చేసింది. 47 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
That's Stumps on Day 1⃣ of the third #INDvAUS Test!
4️⃣ wickets so far for @imjadeja as Australia finish the day with 156/4.
We will be back with LIVE action on Day 2.
Scorecard – https://t.co/t0IGbs1SIL #TeamIndia @mastercardindia pic.twitter.com/osXIdrf9iW
— BCCI (@BCCI) March 1, 2023
Australia take a valuable lead on day one of the Indore Test 🏏#WTC23 | #INDvAUS | 📝: https://t.co/MFbjU9frC0 pic.twitter.com/qiDTWQMnHD
— ICC (@ICC) March 1, 2023