India Vs Australia: అదరగొట్టిన షమీ, సిరాజ్.. 188 పరుగులకు ఆసీస్ ఆలౌట్
Australia all out for 188 runs in the First One Day Match
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఆసీస్ జట్టును 188 పరుగులకే ఆలౌట్ చేశారు. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలు ఇద్దరూ చెరో మూడేసి వికెట్లు పడగొట్టి ఆసీస్ జట్టును కోలుకోలేని దెబ్బ తీశారు. రవీంద్ర జడేజా 2 వికెట్లు, కులదీప్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలకు చెరో వికెట్ లభించింది.
మిచెల్ మార్ష్ భారత బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. 65 బంతుల్లోనే 10 ఫోర్లు 5 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ ఔట్ అయిన దగ్గర నుంచి ఆసీస్ బ్యాటింగ్ గాడి తప్పింది. స్టీవ్ స్మిత్ 22 పరుగులు చేశాడు.
19 పరుగుల తేడాతో 6 వికెట్లు
ఆసీస్ జట్టు టాపార్డర్ ఔటైన తర్వాత భారత బౌలర్లు మరింత విజృంభించారు. షమీ, సిరాజ్, జడేజాలు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 168 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 188 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్లు, టైలెండర్లు చతికిల పడిపోయారు. పరుగులు చేయలేక చేతులెత్తేశారు.
హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ అదరహో
రోహిత్ శర్మ తన బావమరిది పెళ్లి కారణంగా తొలి వన్డే మిస్ అయ్యాడు. రోహిత్ శర్మ లేని తొలి వన్డేలో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. బౌలర్లను సరిగ్గా వినియోగించుకున్నాడు. ఎవరిని ఎప్పుడు బౌలింగ్ చేయడానికి దింపాలో సరిగ్గా నిర్ణయం తీసుకున్నాడు. మంచి ఫలితం సాధించాడు.
Mohammed Siraj picks up the final two wickets as both Sean Abbott and Adam Zampa depart for a duck.
Australia all out for 188 runs.#INDvAUS pic.twitter.com/Fj8MSqDLqk
— BCCI (@BCCI) March 17, 2023
Two wickets fall in quick succession.
Mitchell Marsh and Marnus Labuschagne depart.
Live – https://t.co/8mvcwAvYkJ #INDvAUS @mastercardindia pic.twitter.com/ZV2H6WZnjh
— BCCI (@BCCI) March 17, 2023
Captain Hardik Pandya gets the breakthrough as Steve Smith is caught behind for 22 runs.
KL Rahul with a fine catch behind the stumps.
Live – https://t.co/8mvcwAvYkJ #INDvAUS @mastercardindia pic.twitter.com/V8meOPL6gl
— BCCI (@BCCI) March 17, 2023
CASTLED!
What a delivery THAT from Mohammad Shami 🔥🔥
He has scalped 3️⃣ wickets in no time!
Live – https://t.co/BAvv2E8cgJ #INDvAUS @mastercardindia pic.twitter.com/BymtCPAmXQ
— BCCI (@BCCI) March 17, 2023
..