ICC test rankings: టెస్టుల్లో టాప్ ర్యాంకు దక్కించుకున్న అశ్విన్
Ashwin becomes Number 1 Test Bowler
భారత్ బౌలర్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. ఐసీపీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ను అధిగమించి టాప్ పొజిషన్ లోకి చేరాడు. ప్రస్తుతం అశ్విన్ 864 పాయింట్లతో టాప్ పొజిషన్ చేరుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టుతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టోర్నమెంటులో రవిచంద్రన్ అశ్విన్ అదరగొడుతున్నాడు. మొదటి రెండు టెస్టు మ్యాచుల్లో అద్భుతంగా రాణించిన వికెట్ల వేటలో ముందున్నాడు. టీమిండియా గెలుపుకు ప్రధాన కారకుల్లో ఒకడిగా నిలిచాడు.
2015లో తొలిసారి టాప్ పొజిషన్
రవిచంద్రన్ అశ్విన్ తొలిసారిగా 2015లో టాప్ బౌలర్ స్థానం దక్కించుకున్నాడు. అక్కడి నుంచి అనేకసార్లు అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా మరోసారి అగ్రస్థానం అందుకున్నాడు. జేమ్స్ ఆండర్సన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల జరిగిన టెస్టు మ్యాచుల్లో ఆండర్సన్ రాణించలేకపోవడంతో పాయింట్లు చేజారిపోయాయి. దీంతో రెండో స్థానానికి జారిపోయాడు. టెస్ట్ బౌలర్స్ ర్యాంకుల్లో రవి చంద్రన్ అశ్విన్ 864 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. జేమ్స్ అండర్సన్ 859 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
R Ashwin is the best test bowler in the world as he replaces James Anderson for the top spot. #INDvAUS
— Karishma Singh (@karishmasingh22) March 1, 2023
..