India Vs Australia: తొలి రోజు ఆటకు లక్ష మంది అభిమానులకు ఎంట్రీ
An estimated 100,000 people could pack into Narendra Modi Stadium in Ahmedabad
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే మూడు మ్యాచులు పూర్తయ్యాయి. నాల్గవ మ్యాచ్ అహ్మదాబాద్ నగరంలో జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని కూడా వస్తున్నారు. ఇరుదేశాల ప్రధానులు తొలి రోజు ఆట చూసేందుకు వస్తున్న నేపథ్యంలో మ్యాచ్ నిర్వాహకులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
తొలి రోజు లక్ష మంది ప్రేక్షకులు వచ్చే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. భద్రతా కారణల దృష్ట్యా తొలి రోజు ప్రేక్షకులను అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో క్రికెట్ అభిమానుల నుంచి భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మ్యాచ్ నిర్వాహకులు నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ప్రోటోకాల్ ప్రకారం స్టేడియంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే అభిమానులకు ఎంట్రీ ఇస్తున్నారు. J5, K8, N1, N6, P2 స్టాండ్స్ లో మాత్రమే ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. బుక్ మై షో యాప్ ద్వారా టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అనిల్ పటేల్ తెలిపారు. 200 నుంచి 350 రూపాయల టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడు పోయినట్లు తెలిపారు.
నరేంద్ర మోడీ స్టేడియం
అహ్మదాబాద్ లోని క్రికెట్ గ్రౌండ్ 2020 ఫిబ్రవరిలో ప్రారంభం అయింది. దాదాపు ఐదేళ్ల పాటు ఈ స్టేడియం నిర్మాణం జరిగింది. మొదట్లో ఈ స్టేడియంను మొతేరా స్టేడియం అని, వల్లభాయ్ పటేల్ స్టేడియం అని పిలిచేవారు. 2021లో భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే టెస్టు సందర్భంగా ఈ స్టేడియం పేరు నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చారు.