Jay Shah: ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్, ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్
ACC president Jay Shah has announced the Asia Cup 2023 Schedule
ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్ క్రికెట్ వివరాలను ఆసియా ACC అధ్యక్షుడు జై షా వెల్లడించారు. సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌లో భారత్ పాకిస్తాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు. పాత్ వే స్ట్రక్చర్ అండ్ క్రికెట్ క్యాలెండర్ ఫర్ 2023-24 అనే పేరుతో వివరాలను వెల్లడించారు.
ఈ ఏడాదిలో ఆసియా కప్‌లో 5 జట్లు ఆడనున్నాయి. ఇండియా, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు పాల్గోనున్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్ జరగనుంది. గత ఏడాది జరిగిన ఆసియా కప్‌లో శ్రీలంక జట్టు విజేతగా నిలిచింది.
ఏసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2023, 2024లో ఏకంగా మొత్తం 145 మ్యాచులు జరగనున్నాయి. 2023లో 75 మ్యాచులు, 2024లో 70 మ్యాచులు జరగనున్నాయి.
జై షా చేసిన ఈ ప్రకటనపై పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సేథీ మండిపడ్డారు. ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై షా ప్రకటనపై ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.