Rohit Sharma: అంర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న హిట్ మ్యాచ్
Rohit career: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటికి సరిగ్గా 15 ఏళ్లు. 2007 జూన్ 23న ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఈ హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. ఈ 15 సంవత్సరాల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌లోకి వచ్చి మ్యాచ్‌కు మంచి ఫినీషింగ్ టచ్ ఇచ్చాడు. అనంతరం వన్‌డౌన్‌లో సైతం బ్యాటింగ్ చేశాడు. 2007 టీ20 ప్రపంచకప్ ద్వారా ఓపెనర్ పాత్రను రోహిత్ మొదలు పెట్టాడు. నాటి నుంచి నేటి వరకు ఈ హిట్ మ్యాన్ వెనుదిరిగి చూడలేదు. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఏకంగా 264 పరుగుల వ్యక్తి గత స్కోర్ నమోదు చేశాడు రోహిత్.
రోహిత్ శర్మ రాహుల్ ద్రావిడ్, ఎంఎస్ ధోనీ, వీరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడాడు. వీరిలో ఎక్కువ కాలం ఎంఎస్ ధోని సారథ్యంలో ఆడాడు. ఎవరూ అందుకోని విధంగా రోహిత్ శర్మ వన్డేల్లో రెండు సార్లు డబుల్ సెంచరీని సాధించాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ సోషల్ మీడియాతో పలువురికి ధన్యవాదాలు తెలిపాడు. తన క్రికెట్ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తాను ఆటగాడిగా ఈ స్థాయిలో ఉండటానికి సహకరించిన వారికి, ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ