IND vs SA: నేడే తిరువనంతపురం వేదికగా తొలి టీ 20
IND vs SA: టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాతో పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్యఈరోజు తొలి టీ20 జరుగనుంది.ఈ సిరీస్ లో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతినిచ్చారు. ఫలితంగా తుది జట్టు ఎంపిక మేనేజ్‌మెంట్‌కు ఇబ్బందికరంగా మారింది. గాయం కారణంగా దీపక్ హుడా కూడా అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
తుది జట్టులో దినేశ్ కార్తీక్‌తో పాటు రిషబ్ పంత్‌కు చోటు దక్కనుంది. మరోవైపు ఈ ఫార్మాట్‌లో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన దక్షిణాఫ్రికా.. సొంతగడ్డపై భారత్‌ను ఓడించి ప్రపంచకప్ ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చూస్తున్నది.బౌలింగ్ పరంగా బుమ్రా, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్ ఉండనున్నారు.
స్పిన్ లో అక్షర్ పటేల్, ఆశ్విన్, చాహర్ ఉన్నారు. ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్‌లో తలెత్తిన లోపాలను సరి చేసుకుని బరిలోకి దిగాలని టీమిండియా యోచిస్తోంది. ఈసిరీస్‌ను సైతం దక్కించుకుని..వరల్డ్ కప్‌నకు వెళ్లాలని భావిస్తోంది. ఇటు దక్షిణాఫ్రికా జట్టు సైతం బలంగా ఉంది. ఇటీవల టీ20ల్లో ఆ జట్టు విశేషంగా రాణిస్తోంది. దీంతో తిరువనంతపురం టీ20 రసవత్తరంగా సాగనుంది. రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, పంత్, కార్తీక్, అక్షర్, దీపక్, అర్శ్‌దీప్, బుమ్రా, చాహల్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, రాసో, మార్క్మ్,్ర మిల్లర్, స్టబ్స్, ఫెలుక్వాయో, జెన్సెన్, రబడ, నోర్జే, తబ్రేజ్ షంసీ.