ఉత్తరాంధ్రలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రూ.6.5 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలని దేవదాయశాఖ అధికారులు నిర్ణయించారు.
గ్రామదేవతలు మొత్తం 101 మంది అక్క చెల్లెళ్లు వారికి ఒక్కరే తమ్ముడు పోతురాజు.101 మంది అక్క చెల్లెళ్ళ లో అందరికంటే చిన్నవిడ నూకాలమ్మ. అక్కలందరికి ముద్దుల చెల్లెలు నూకాలమ్మ(nookalamma). అనకాపల్లి(Anakapalle) గ్రామం లో వెలసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, విశాఖపట్టణం జిల్లా, అనకాపల్లి అనే పట్టణంలో శ్రీ నూకాంబిక దేవి(Nookambika) అనే గ్రామదేవత ఆలయం ఉంది. ఈ ఆలయం నిర్మించి ఇప్పటికి 550 సంవత్సరాలు అయినట్లుగా చరిత్ర తెలియచేస్తుంది. ఈ తల్లికి నూకాంబిక(Nookambika temple) మరియు కాకతాంబ అనే పేర్లు కూడా ఉన్నాయి. 1450 వ సంవత్సరంలో అనకాపల్లి ప్రాంతాన్ని పరిపాలించిన కాకర్లపూడి అప్పలరాజు అనే కళింగరాజు అనకాపల్లిలో ఒక కోటను నిర్మించి ఆ కోటకు దక్షిణభాగంలో కాకతాంబ ఆలయాన్ని నిర్మించాడు. ఆ తరువాత బ్రిటీషువారు విజయనగరం రాజును అనకాపల్లి రాజుగా నియమించారు. బ్రిటిషువాళ్లే కాకతాంబ అనే పేరుని నూకాంబిక అని మార్చటం జరిగింది.
ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధం
ఉత్తరాంధ్రలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన అనకాపల్లి (Anakapalli) నూకాంబిక(Nookambika) అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రూ.6.5 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలని దేవదాయశాఖ అధికారులు నిర్ణయించారు. వచ్చే నెల ఎనిమిదో తేదీన ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేయడానికి చర్యలు చేపడుతున్నారు. తొలి దశలో రూ.3 కోట్లతో అంతరాలయం, గర్భాలయం, అనివేటి మండపం నిర్మిస్తారు. ఇవన్నీ పూర్తిగా రాతికట్టుతోనే చేపడతారు. కాణిపాకం వినాయక ఆలయం, తలుపులమ్మలోవ, రామతీర్థాలు ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపట్టిన శ్రీధర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌తో టెండర్ అగ్రిమెంట్ అయినట్టు ఆలయ అధికారులు చెప్పారు. ఇక రెండో దశలో రూ.3.5 కోట్లతో ఆలయ ప్రాకార మండపంతోపాటు ప్రస్తుతం ఆలయానికి తూర్పు దిశలో ఉన్న రాజగోపురం మాదిరిగా ఉత్తర, దక్షిణ, పడమర దిశల్లో మూడంతస్థులతో రాజగోపురాలను నిర్మిస్తారు.
ప్రస్తుతం 14.5 అడుగులు ఉన్న గర్భాలయాన్ని అదే స్థానంలో కొత్తగా నిర్మిస్తారు. ఐదు అడుగుల వెడల్పు ఉన్న అంతరాలయాన్ని 12.5 అడుగులకు విస్తరిస్తారు. 14 అడుగులు ఉన్న అనివేటి మండపాన్ని 35 అడుగులకు పెంచుతారు. ప్రస్తుతం ఆలయ నిధులు సుమారు రూ.5.5 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఎఫ్‌డీల రూపంలో ఉన్నాయని, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ట్రస్టు నుంచి రూ.3 కోట్లు ఇవ్వడానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subba Reddy) ఇటీవల అనకాపల్లి వచ్చినప్పుడు హామీ ఇచ్చారని ఆలయ ఈవో బండారు ప్రసాద్ చెప్పారు. వచ్చే ఏడాది మార్చి/ ఏప్రిల్ నాటికి (నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర) ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి అవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
శ్రీ నూకాంబిక అమ్మవారిని పూర్వం ఏమని పిలిచేవారు..?
లక్షలాది మందికి ఆరాధ్యదైవం అయిన శ్రీ నూకాంబిక అమ్మవారు పూర్వం నవశక్తులలో ఒక శక్తి అయినా “శ్రీ అనఘాదేవి” గా ప్రతిష్ఠితమై పూజలందుకొనుచున్నది. ఈ క్షేత్రం లో వెలసిన అనఘాదేవి అన్న శక్తి స్వరూపిణి కారణంగానే ..ఈ ఉరికి మొదట అనఘాపల్లి అని ఆ తరువాత అనకపల్లిగా ఈ క్షేత్రం పేరు మార్పు చెందిందని చరిత్రకారులు చెప్తారు. కాలక్రమములో శిధిలమై, మరల కాకతీయ రాజుల ప్రభావంచే శ్రీ కాకతాంబ గా పునః ప్రతిష్టించబడిన ఈ మాత నిత్య పూజలు అందుకొంటూ భక్తులకు వరప్రదాయినిగా దర్శనమిస్తుంది.
ఆర్కాటునవాబు వద్ద సేనాధిపతిగా పనిచేసిన శ్రీ కాకర్లపూడి అప్పలరాజు క్రీ.శ. 1611 సంవత్సర కాలంలో ఈ ప్రాంతానికి పాలకునిగా నియమించబడటం. అప్పటివరకు “శ్రీకాకతాంబ” గా పిలవబడుచున్న అమ్మవారిని శ్రీ కాకర్లపూడి అప్పలరాజు తమ ఇలవేలుపుగా మరియు కోటను రక్షించు శక్తి అయిన “శ్రీనూకాంబిక అమ్మవారు” గా పేరు మార్చి శాక్తేయగమానుసారము పూజించసాగారు. అప్పటినుండి నిత్యపూజలు అందుకుంటూ గొప్ప మహిమలు గల అమ్మవారిగా భక్తులు హృదయాలలో నిలిచిపోయింది. ఈమెను దర్శించి ప్రార్దించిన భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించగలదని ఈ ప్రాంత ప్రజల గట్టి నమ్మకం.
కలియుగ ప్రారంభానికి సంకేతంగా నిలిచే ఉగాది పర్వదినానికి ముందురోజు అమావాస్యనాటి నుండి అనగా ఫాల్గుణ బహుళ అమావాస్య నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు ఈ నూకాంబిక సమక్షంలో కొత్త అమావాస్య జాతర నిర్వహిస్తారు. ఉత్తరాంధ్రలో బాగా పేరుపొందిన ఈ జాతరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.