దేవుడు అంటే ఎవరు... ఏ రూపంలో ఉంటాడు... అంటే దానికి సరైన సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే, దైవం ఏ రూపంలోనైనా ఉండొచ్చు. పదిమందికి ఉపయోగపడే విధంగా, పది మంది అవసరాలను తీర్చే విధంగా, పదిమందికోసం బతికే వ్యక్తిని దైవరూపంగా చెబుతారు. ఉదాహరణకు హనుమంతుడు.. ఈయన శ్రీరామచంద్రుడికి సేవచేయడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
Squirrel Hanuman Temple: దేవుడు అంటే ఎవరు… ఏ రూపంలో ఉంటాడు… అంటే దానికి సరైన సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే, దైవం ఏ రూపంలోనైనా ఉండొచ్చు. పదిమందికి ఉపయోగపడే విధంగా, పది మంది అవసరాలను తీర్చే విధంగా, పదిమందికోసం బతికే వ్యక్తిని దైవరూపంగా చెబుతారు. ఉదాహరణకు హనుమంతుడు.. ఈయన శ్రీరామచంద్రుడికి సేవచేయడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనునిత్యం రామస్మరణ చేస్తూ రాముడి భక్తిలో మునిగిపోయాడు. సీతమ్మ జాడను కనుగొనడంలో శ్రీరామచంద్రుడికి సహకించాడు. ఆంజనేయుడు తన పరాక్రమంతో రావణ వీరులు ఎందరినో మట్టికరిపించాడు. అంతేందుకు, రామసేతు నిర్మించే సమయంలో ఔరా…నాకు అంతటి శక్తి లేదే… వీరులంతా పెద్ద పెద్ద బండరాళ్లు తెచ్చి సముద్రంలో వేస్తూ వారధి నిర్మిస్తున్నారు… నేను కూడా ఏదైనా చేస్తే బాగుండు అనుకున్న ఓ ఉడత చెంగుచెంగున సముద్రంలోకి వెళ్లి శరీరాన్ని తడి చేసుకొని ఇసుకలో పొర్లి రాళ్ల మధ్య విదిలించి వచ్చింది.
అందుకే అంటారు… సహాయం ఎంతదైనా అవసరం అనుకుంటే చేయాలి. ఉడతాభక్తిగా అందించినా సరిపోతుంది. ఉడత గొప్పదనాన్ని లోకానికి చాటిచెప్పేవిధంగా ఉడతకు ఓ ఆలయం నిర్మించారు. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ వద్ద ఉన్న అచల్ సరోవర్ ఒడ్డున ఓ ఆంజనేయ దేవాలయం ఉంది. ఇక్కడ ఆంజనేయుడు ఉడత రూపంలో దర్శనం ఇస్తాడు. ఉడతను భక్తులు ఆంజనేయుడిగా పూజిస్తారు. సింధూరవర్ణంలో ఉండే ఉడత ప్రతిమను నిత్యం వందలాది మంది దర్శించుకుంటుంటారు. బలరాముడు ఈ దేవాలయంలోని ఉడత రూపంలో ఉన్న ఆంజనేయుడికి పూజలు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరతాయని భక్తుల విశ్వాసం.