ఏడాదికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో నిర్జల ఏకాదశి (Nirjala ekadashi) ఉత్తమమైనదిగా చెబుతారు. మహాభారత (Mahabharata) యోధుడైన భీముడు కూడా ఈ ఉపవాసాన్ని పాటించారట.
ఏడాదికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో నిర్జల ఏకాదశి (Nirjala ekadashi) ఉత్తమమైనదిగా చెబుతారు. మహాభారత (Mahabharata) యోధుడైన భీముడు కూడా ఈ ఉపవాసాన్ని పాటించారట. నిజానికి, 10,000 ఏనుగుల బలం ఉన్న భీముడు చాలా ఆకలితో ఉండేవాడట. తన ఆకలిని తట్టుకోలేకపోయాడట. ఉపవాసం వల్ల మోక్షం లభిస్తుందని భీముడికి తెలుసు. కానీ భీముడు అంత ఉపవాసం పాటించడం సాధ్యం కాలేదు అని చెబుతారు.
నిర్జల ఏకాదశిని(Nirjala Ekadashi 2023) జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఏడాదికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో నిర్జల ఏకాదశి ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. నిర్జల ఏకాదశి రోజున నీరు లేని ఉపవాసం ఉండటం వల్ల ఆశించిన ఫలితాలు,మోక్షం లభిస్తుందని పండితులు చెప్తారు. ఇది సంవత్సరంలో అతిపెద్ద ఏకాదశి. ఈసారి మే 31న నిర్జల ఏకాదశి వ్రతం పాటింస్తే చాలా మంచిదట.
భీముడు నిర్జల ఏకాదశి రోజు ఉపవాసాన్ని పాటించాడా..?
పురాణాల ప్రకారం మహాభారతం శక్తివంతమైన యోధుడు భీముడు(bheemudu) కూడా ఈ ఉపవాసాన్ని పాటించాడు.నిజానికి, 10,000 ఏనుగుల బలం ఉన్న భీముడు చాలా ఆకలి ఉండేది. తన ఆకలిని అస్సలు తట్టుకోలేకపోయాడు. ఉపవాసం వల్ల మోక్షం లభిస్తుందని భీముడికి తెలుసు. కానీ భీముడు అంత ఉపవాసం పాటించడం సాధ్యం కాలేదు.అప్పుడు శ్రీ కృష్ణుని ఆదేశానుసారం, భీముడు ఏకైక నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని పాటించాడు. ఆకలికి తట్టుకోలేక సాయంత్రం స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఏకాదశి నాడు భీముడు ఉపవాసం పాటించాడు కాబట్టి దీనిని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున నీరు లేకుండా ఉపవాసం చేయడం వల్ల సంవత్సరంలోని అన్ని ఏకాదశుల పుణ్య ఫలితాలు లభిస్తాయని చెబుతారు.
నిర్జల ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అంటే..?
నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల ధర్మం, అర్థ, కామ, మోక్షం అనే నాలుగు పురుషార్థాలు లభిస్తాయి. అంతే కాకుండా, ఈ రోజు ఉపవాసం మంచి ఆరోగ్యం ,సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఉపవాసం చేయడం వల్ల పాపాలు నశించి, మనస్సు పవిత్రంగా మారుతుంది. ఈ ఏకాదశి త్యాగం, తపస్సు అతిపెద్ద ఏకాదశిగా పరిగణించబడుతుంది.
నిర్జల ఏకాదశి శుభ సమయం..
జ్యేష్ఠ శుక్ల ఏకాదశి తిథి మే 30న మధ్యాహ్నం 01:07 గంటలకు ప్రారంభమై మే 31 మధ్యాహ్నం 01:45 గంటలకు ముగుస్తుంది. తిథి కారణంగా, ఈ నిర్జల ఏకాదశి వ్రతం మే 31న ఆచరించబడుతుంది. నిర్జల ఏకాదశి జూన్ 01 న జరుపుకుంటారు. నిర్జల ఏకాదశి రోజున తెల్లవారుజామున స్నానమాచరించి సూర్యభగవానునికి నీటిని సమర్పించండం వలన. దీని తరువాత పసుపు బట్టలు ధరించి విష్ణువు లేదా శ్రీకృష్ణుడిని పూజించాలి. పసుపు పువ్వులు, పంచామృతం,తులసి దళాన్ని వారికి సమర్పించాలి. దీని తరువాత, విష్ణువు మరియు తల్లి లక్ష్మి మంత్రాలను జపించండం ఉపవాస వ్రతం చేసిన తర్వాత, మరుసటి రోజు సూర్యోదయం వరకు చుక్క నీరు కూడా తీసుకోవద్దు. ఆహారం, పండ్లు కూడా తినకూడదు అని పండితులు చెపుతారు. మరుసటి రోజు అనగా ద్వాదశి తిథి నాడు స్నానమాచరించి, శ్రీ హరిని మరల పూజించిన తరువాత, ఆహారం, నీరు తీసుకుని ఉపవాసం విరమిస్తే చాలా మంచిదని అనుకున్న కోరికలు నేరువేరుతాయని నమ్మకం.