ఆచార వ్యవహారాలకు, సంస్కృతి, సంప్రదాయాలకు భారత దేశం నిలయం. దేశంలో ఏన్నో లక్షల దేవాలయాలు ఉన్నాయి. వేదకాలం నుంచే దేవాలయాలను సంరక్షిస్తూ వస్తున్నారు. నేటికీ దేశంలో అనేక పురాతన ఆలయాలు మనుగడలో ఉన్నాయి.
Lord Srirama Temple: ఆచార వ్యవహారాలకు, సంస్కృతి, సంప్రదాయాలకు భారత దేశం నిలయం. దేశంలో ఏన్నో లక్షల దేవాలయాలు ఉన్నాయి. వేదకాలం నుంచే దేవాలయాలను సంరక్షిస్తూ వస్తున్నారు. నేటికీ దేశంలో అనేక పురాతన ఆలయాలు మనుగడలో ఉన్నాయి. పూజలు అందుకుంటున్నాయి. ఆలయం నిర్మాణమైన సమయంలో ఏర్పాటు చేసిన కైంకర్యాలకు అనుగుణంగా ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఇలాంటి ఆలయాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
తెలంగాణలో కాకతీయ రాజుల పరిపాలనా కాలంలో అనేక వందల ఆలయాలను నిర్మించారు. ఇందులో ఒకటి గంభీరావుపేటలోని శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయం. ఈ ఆలయం నిర్మించి నేటికి వెయ్యేళ్లు దాటింది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అదేవిధంగా ఉన్నది. ఈ ఆలయం రాజన్న సిరిసిల్లలోని గంభీరావుపేట కేంద్రంలో ఉంది. కాకతీయులు ఈ ఆలయం నిర్మించిన సమయంలో అఖండ దీపాన్ని వెలిగించారు. అప్పటి నుంచి నేటి వరకు ఈ అఖండదీపం అదేవిధంగా వెలుగుతూనే ఉన్నది. అంతేకాదు, ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో ప్రతిష్టించిన విగ్రహాలు భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలను పోలి ఉంటాయి. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇటీవలే ఈ ఆలయాన్ని మరమ్మత్తులు చేయించారు.