హనుమంతుడు... దైర్యానికి ప్రతీక... పరాక్రమానికి మారుపేరు. చిరంజీవిగా పేరుగాంచిన ఆయన ప్రతి గ్రామంలో పూజలందుకుంటూ ఉంటాడు. హనుమంతుడికి దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో విధమైన ప్రత్యేకత ఉంటుంది.
Hanuman Temple: హనుమంతుడు… దైర్యానికి ప్రతీక… పరాక్రమానికి మారుపేరు. చిరంజీవిగా పేరుగాంచిన ఆయన ప్రతి గ్రామంలో పూజలందుకుంటూ ఉంటాడు. హనుమంతుడికి దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో విధమైన ప్రత్యేకత ఉంటుంది. ఏ ఆలయంలో తీసుకున్నా సాధారణంగా ఒకే విధమైన భంగిమలో హనుమంతుడు దర్శనం ఇస్తాడు. గధదారిగా, ధ్యానరూపంలో, సంజీవిని పర్వత ధారియై దర్శనం ఇస్తుంటాడు. అంతేకాదు, సింధూర రూపంలో కూడా ఆంజనేయుడు దర్శనం ఇస్తాడు. ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతుడిని ఎక్కువగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. జార్ఖండ్లో ఓ ప్రాంతంలో ఆంజనేయుడు ఉడత రూపంలో దర్శనం ఇస్తారు.
కానీ, ఒకే ఒక్క దేవాలయంలో మాత్రం హనుమంతుడు స్త్రీ దేవతా రూపంలో దర్శనం ఇస్తుంటాడు. ప్రపంచంలో ఇలాంటి దేవాలయం ఒకే ఒక్కటే ఉంది. చత్తీస్గడ్ రాష్ట్రంలోని రతన్పూర్ జిల్లా గిర్జ్బంధ్ ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ఆంజనేయుడిని స్త్రీ రూపంలో కొలుస్తారు. ఆంజనేయుడిని స్త్రీరూపంలో కొలిచే దేవాలయం ఇదొక్కటే ఉండటం విశేషం. దేవతా రూపంలో ఉన్న హనుమంతుడిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. రతన్ పూర్ రాజుల హయాంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. నిత్యం వందలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. కొరికలు నెరవేరిన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారట. రతన్ పూర్ రాజుల శాసనాల ప్రకారం, కలలో కనిపించి దేవతా రూపంలో ఉండే ఆంజనేయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరడంతో రాజులు ఆ విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారని భక్తులు నమ్ముతారు. మాయకుండ్ వద్ద లభించిన విగ్రహంతో ఈ దేవాలన్ని నిర్మించినట్టు భక్తులు విశ్వసిస్తారు.