సరిహద్దుల్లో(army border) సైన్యం అంటే..మగవారే అనుకుని రోజులు కావివి. అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో..శారీరక ప్రతికూలతల్ని తట్టుకుని మన దేశ భద్రతలో మేము సైతం అంటున్నారు.
సరిహద్దుల్లో(army border) సైన్యం అంటే..మగవారే అనుకుని రోజులు కావివి. అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో..శారీరక ప్రతికూలతల్ని తట్టుకుని మన దేశ భద్రతలో మేము సైతం అంటున్నారు. ఈ తరం మహిళలు(women). మంచు కొండల మధ్య సరిహద్దులను కాపాడటంలో తమ శక్తిని చాటుతున్నారు. దేశ రక్షణలో అత్యంత కీలకమైన శ్రీనగర్(srinagar) లో గస్తీ అంటే మాటలేం కాదు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని పహరా కాయాలి. అలాంటి చోటా రాత్రింబవళ్లూ సైనిక స్థావరాలపై రక్షణ చూస్తున్నారు కొందరు మహిళా కమాండోలు(women Commandos).వారిలో శ్రీనగర్ కి చెందిన 29 ఏళ్ల పాషా (pasha)ఒకరు. ఇంటి దేశాన్ని పసిపాపల కాచుకోవడానికి బాధ్యతగా భావిస్తున్నా. అందుకే ఉదయమే ఇంట్లో అందరికి వంట సిద్ధం చేసి మరి విధులకు వెళ్తుంది అట. పాపిటా సిందూరం,నుదుట బొట్టు,భుజానికి 3 కేజీల ఏకే-47 లే నా అభరణాలు అని గర్వంగా చెబుతోంది ఈమే.
ఈ శాన్య ప్రాంతంలోని సీఆర్పి ఎస్ క్యాంపులో అసొంకు చెందిన బాసుమతి(basumathi) 30 బుల్లెట్ల లోడ్ తో పాటు 3 కేజీల బరువుండే రైఫిల్(Rifil ) రోజంతా భుజానికే వుంటుందట. అయినా ఆరడుగుల ఎత్తు గోడపైకి అవలీలగా ఎక్కి అవతలకు అంతే దూకగలదు. శత్రుబలగాల రాకను అడ్డుకోవడానికి తన శక్తి సామర్ధ్యాలన్ని వినియోగించలను అంటారు ఆమె. మిజోరం రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల నోవ్ పరీక్షకు హజరయ్యేప్పటకి పాలు తాగే ఆరు నెలల పాప వుంది. కాని అయినా సరే పరీక్షకు హాజరయ్యా. దేశ సేవలో పాలు పంచుకోవాలనే లక్ష్యం ఇందుకు కారణం అంటారు ఆమె.
తీవ్రవాదుల్ని మట్టు బెడుతారు.
కశ్మీరులో(kashmir) ఆయుధాల పరిశీలన, అల్లర్ల నియంత్రణ మహిళ సీఆర్పీ ఎస్ దళం బాధ్యతలు. ప్రత్యేకంగా ఈమె ఇక్కడ ఉమెన్ వ్యాలీ క్విక్ యాక్షన్ టీం(వ్యాలీ క్వాట్ ని) ఏర్పాటు చేసింది. వీరంతా గడ్డ కట్టిన మంచు గడ్డలో ,దాల్ లేక్ మధ్యలో బోట్ లో పహరా కాస్తారు. తీవ్రవాదులను మట్టుబట్టే ఆపరేషన్స్ లో పాలుపంచుకుంటారు. మోకాళ్లలోతు మంచులో వణికించే చలిలో మరి గంటల తరబడి నిలబడిన ఏ రోజు అలసిపోలేదు అంటారు. ఈ బృందంలోని గౌరి ఇక జమ్ము,కాశ్మీర్ సరిహద్దులో కొత్తగా ఉమెన్ ఇన్ ఖాకీ బృందం జమ్ములోకి ప్రవేశించే బయటకువెళ్ళే మార్గాల్లో తనీఖీలలో మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేస్తోంది. చత్తీస్ గఢ్ లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఎప్పుడే ఏ ఉపద్రవం ఎదురవుతుందో ఊహించలేము అంటారు ఎస్సై రాగిణి. మా ప్రాంతం అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తుంది. దంతెవాడ ,బీజపూర్, సుక్మావంటి ప్రాంతాల్లో మేం రైఫిల్ పేలుడు పదార్ధాల డిటెక్టర్స్ మంచినీళ్ళ సీసాలతో మైళ్ళ దూరం నడుస్తాం అని గుర్తుచేసుకుంటారు ఆమె.