ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్లలో ఇదీ ఒకటి.
Optical Illution: కళ్లను మాయ చేసే ఆప్టికల్ ఇల్యూషన్లు (Optical Illution) అంటే మీకు ఆసక్తి ఉందా? అయితే ఇది మీకోసమే. ఇక్కడున్న ఫోటోలో ఎన్ని జీవులు (Animals) ఉన్నాయో లెక్కించి చెప్పండి. అది కూడా కేవలం ఒక్క నిమిషంలోపే. సరైన సమాధానం చెబితే మీ కంటి చూపు (Eye), మెదడు (Brain) పనిచేసే తీరు అద్భుతం అని ఒప్పుకోవచ్చు. నిమిషం కన్నా ఎక్కువ సమయం తీసుకుంటే ఎవరైనా చెప్పేస్తారు. మీరు తెలివైన వారని నిరూపించుకోవాలనుకుంటే కచ్చితంగా నిమిషంలోపే జీవులను లెక్క పెట్టి చెప్పాలి. మీకు క్లూ కావాలంటే ఇస్తున్నాం…. అదేంటంటే కొన్ని జంతువులు తెలుపు రంగులో ఉంటే, కొన్ని నలుపురంగులో ఉన్నాయి.
తెలివైన వారు ఇప్పటికే లెక్కపెట్టేసి ఉంటారు. వారికి కంగ్రాట్స్. ఇక లెక్కపెట్టడానికి కష్టపడుతున్న వారికి జవాబును మేమే అందిస్తున్నాం. ఈ చిత్రంలో మొత్తం తొమ్మిది జీవుతున్నాయి. అవేంటంటే ఏనుగు, డాల్ఫిన్, మొసలి, పాము, గాడిద, పిల్లి, ఎలుక, చేప, కుక్క. అవి ఎక్కడ ఉన్నాయో కూడా కింద అంకెలతో ఓ ఫోటోను పెట్టాం చూడండి.
ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ఓ అందమైన కళ. భ్రమ అనిపిస్తూనే నిజాన్ని దాస్తుంది. ఆ నిజాన్ని వెతికి పట్టుకోవడమే ఆప్టికల్ ఇల్యూషన్. ఇది కంటి చూపుకు, మెదడుకు మధ్య అనుబంధాన్ని గట్టిపరచడంలో ముందుంటుంది. ఇది మెదుడుకు మేతలా ఉంటాయి. ఖాళీ సమయంలో మంచి టైమ్ పాస్ ను అందిస్తాయి. ఇప్పుడంటే మనకు టీవీలు, ఇంటర్నెట్లు వచ్చాయి. ఒకప్పుడు ప్రాచీన ప్రజలకు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ద్వారానే పొద్దు పోయేది. ఇవే వారికి వినోదాన్ని అందించేవి.