ఈ మామిడి పండ్ల ధర అక్షరాల రూ. 3 కోట్లు…
సాధారణంగా సమ్మర్ వచ్చింది అంటే మనకు ఎక్కడ చూసినా మామిడి పండ్లు కనిపిస్తుంటాయి. మామిడి పండ్లు బాగా పండితే కిలో సుమారు 30 నుంచి 40 వరకు, డిమాండ్ పెరిగితే కిలో 100 వరకు ఉంటుంది. కానీ జపాన్ కు చెందిన తైయాగో తమగో అనే రకం మామిడి పండ్ల ధర భారీగా ఉంటుంది. కిలో పండ్లు సుమారు 3 లక్షల వరకు ఉంటాయి. ఈ స్థాయిలో ధరలు ఉండటానికి కారణం లేకపోలేదు. ఇవి జపాన్ లోని మియాజాకి ప్రావిన్స్ లొనే ఎక్కువగా పండుతాయి. అందుకే ఈ రకం పనులకు డిమాండ్ ఎక్కువ. ఈ పండ్లు ఇప్పుడు ఇండియా లోని మధ్యప్రదేశ్ లో కూడా పండిస్తున్నారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి జబల్పూర్ కు చెందిన రాణి, సంకల్ప్ పరిహార్ దంపతులకు గిఫ్ట్ గా ఇవ్వగా వాటిని తమ తోటలోజాగ్రత్తగా పెంచడం మొదలుపెట్టారు. కాయలు కాసే దశకు చేరుకోవడంతో కుక్కలను, ప్రత్యేకంగా గార్ధులను నియమించి చెట్లకు కాపలాగా ఉంచారు.