అమెరికా శ్వేతసౌధంలో అడుగుపెట్టాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ కలిగిన అధ్యక్షుడి భవనం. అనుమతులు లేకుండా ఇలాంటి భవనం సమీపంలోకి అడుగుపెట్టాలని చూస్తే వారి ప్రాణాలను వదిలేసుకోవలసిందే.
Sai Varshith: అమెరికా శ్వేతసౌధంలో అడుగుపెట్టాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ కలిగిన అధ్యక్షుడి భవనం. అనుమతులు లేకుండా ఇలాంటి భవనం సమీపంలోకి అడుగుపెట్టాలని చూస్తే వారి ప్రాణాలను వదిలేసుకోవలసిందే. దూరం నుంచి చూసిరావడమే తప్పించి సామాన్యులు ఆ భవనం సమీపంలోకి వేళ్లేందుకు సాహయం చేయరు. ప్రత్యేక అనుమతులు ఉంటేనే ప్రాంగణంలోకి అడుగుపెట్టనిస్తారు. అధ్యక్ష భవనం సెక్యూరిటీ హైఎండ్ టెక్నాలజీతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. శతృదుర్భేధ్యంగా ఉండే ఈ భవనంలోకి ఓ వ్యక్తి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అదీ ఓ పెద్ద ట్రక్ తీసుకొని గేటును డీకొట్టి లోనికి ప్రవేశించేందుకు సాహసించాడు.
ఇంతటి సాహసం చేసిన యువకుడి పేరు సాయి వర్షిత్. తెలుగు మూలాలున్నా భారతీయుడు. వీరి కుటుంబం చాలా కాలం క్రితం ఇండియా నుంచి అమెరికాలోని మిస్సోరికి వచ్చారు. అక్కడే స్థిరపడ్డారు. చాలా కాలంగా ఆ కుటుంబం అక్కడే ఉంటోంది. సాయి వర్షిత్ కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీని పూర్తిచేశాడు. ప్రోగ్రామ్ కోడింగ్ లో నైపుణ్యం కలిగియున్నాడు. మంచి భవిష్యత్తు ఉన్న సాయి వర్షిత్ ఎందుకు శ్వేతసౌథంపై దాడికి యత్నించాడన్నది అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.
మిస్సోరిలోని చెస్ట్ఫీల్డ్ నుంచి వాషింగ్టన్కు వచ్చిన సాయి వర్షిత్ ఓ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. అనంతరం, ఆ ట్రక్కుతో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వైట్ హౌస్‌లోని నార్త్ బ్లాక్‌లోని గేటును ఢీకొట్టాడు. గేటు తెరుచుకోకపోవడంతో మరోమారు ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ పోలీసులు, సీక్రెట్ ఏజెంట్స్ ట్రక్కును చుట్టుముట్టి సాయివర్షిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కందుల సాయి వర్షిత్ చెప్పిన విషయాలు విని పోలీసులు షాకయ్యారు. శ్వేతసౌథాన్ని స్వాధీనం చేసుకోవడానికి తాను ఈ పనిచేశానని, ఈ క్రమంలో అవసరమైతే అధ్యక్షుడిని లేదా ఉపాధ్యక్ష కుటుంబాన్ని సైతం అంతం చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విని పోలీసులు అవాక్కయ్యారు. ట్రక్కులో దొరికిన నాజీ జెండాలను చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు సాయివర్షిత్‌ను ఆ దిశగా ప్రశ్నించగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తాను ఆ జెండాలను ఆన్లైన్లో కొనుగోలు చేసినట్టు తెలియజేశాడు. శ్వేతసౌథాన్ని స్వాధీనంలోకి తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పోలీసుల ఇంటరాగేషన్‌లో సాయి పేర్కొన్నాడు. మంచి భవిష్యత్ ఉన్న సాయి ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, అతని మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయి… కుటుంబం నేపథ్యం ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బైడెన్ జీ 7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం విశేషం. ప్రస్తుతం సాయి వర్షిత్ పోలీసుల కష్టడీలోనే ఉన్నారు. కంప్యూటర్ కోడింగ్ రాయడంలో మంచి నేర్పరైన సాయి ఇలా ఎందుకు చేశాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. జర్మనీలోని నాజీలతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనేకోణంలో కూడా విచారణ చేస్తున్నారు.
హిట్లర్ అంటే సాయి వర్షిత్‌కు వల్లమాలిన ప్రేమ ఉంది. హిట్లర్ తన జీవితంలో అధికారంలోకి వచ్చేందుకు ఎంతగా ప్రయత్నించారో, ఎంత కష్టపడ్డాడో సాయికి తెలుసు. ఒక చిన్న జవాను నుంచి ప్రపంచాన్ని గజగజ వణికించే స్థాయికి ఎదిగిన తీరు సాయి వర్షిత్‌ను ప్రేరేపించింది. ఎలాగైనా ఎదగాలని, ప్రపంచం దృష్టిలో తన పేరు మారుమ్రోగాలని అనుకున్నాడు. దీనికి మంచి మార్గాలు ఎన్నో ఉన్నా, సాయి తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడంతో కటకటాలపాలయ్యాడు.