నేడు వారికోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ…
తిరుపతి తిరుమల దేవస్థానం ఏప్రిల్ నెలకు సంబంధించి వయోవృద్దులు, వికలాంగుల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ నెలకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చేయనున్నది. రోజుకు వెయ్యి టిక్కెట్ల చొప్పున విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలియజేసింది.
రేపటి నుంచి ప్రత్యేక దర్శన టిక్కెట్లు తీసుకున్నవారు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే, ఎల్లుండికి సంబంధించిన సర్వదర్శన టోకెన్లను ఈరోజు జారీచేయనున్నారు. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానంను నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక ఏప్రిల్ 11ద తేదీన శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.