బోల్తాపడిన లారీ… థమ్స్ అప్ బాటిళ్లు ఎత్తుకెళ్లిన జనం…
రంగారెడ్డి జిల్లాలోని తారామతిపేట్‌లో థమ్స్అప్ కూల్‌డ్రింక్ బాటిళ్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. లారీలోనుంచి వందలాది థమ్స్ అప్ కూల్‌డ్రింక్ బాటిళ్లు నేలపాలయ్యాయి. కిందపడిపోయిన కూల్‌డ్రింక్ బాటిళ్లు రోడ్డుపై పడ్డాయని తెలుసుకున్న జనం భారీగా అక్కడికి చేరుకొని చేతివాటం చూపించారు. దొరికినంత దోచుకో అన్నట్టుగా, చేతికి అందిన బాటిళ్లను ఎత్తుకొని అక్కడి నుంచి ఉడాయించారు. తారామతిపేట్ వద్ద ఉన్న ఓఆర్ఆర్ పై ఈ ప్రమాదం జరిగింది. లారీ వెనుక టైర్ పేలిపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అయితే, ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్పగాయాలయ్యాయి. వీరిని పట్టించుకోకుండా జనాలు అందినకాడికి బాటిళ్ల ట్రేలను ఎత్తుకుపోవడం విశేషం. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్, క్లీనర్‌ను ఆసుపత్రికి తరలించారు. ట్రాపిక్‌కు అంతరాయం కలుగకుండా క్లియర్ చేశారు.