బీస్ట్ డైరెక్టర్‌పై విజయ్ తండ్రి కీలక వ్యాఖ్యలు… ఫెయిల్యూర్‌కు ఇదే కారణం…
విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా ఈనెల 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టడంపై విజయ్ తండ్రి దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీస్ట్ సినిమా లైన్ బాగున్నా, ఆ సనిమా ఫెయిల్ కావడానికి దానికి తగినట్టుగా స్క్రీన్‌ప్లే లేకపోవడమేనని ఇటీవల ఓ తమిళ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. టెర్రరిజం, రా వంటి అంశాల చుట్టూ కథను నడిపించినా, బలమైన కథనాలను సృష్టించడంలో దర్శకులు నెల్సన్ దిలీప్‌కుమార్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు.
హీరో విజయ్‌కు ఉన్న స్టార్ ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని నెల్సన్ సినిమాను రూపొందించినట్టు చంద్రశేఖర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ టెర్రరిజం, వాటి ఆర్గనైజేషన్లు, మిలిటరీ ఆపరేషన్స్, రా వంటివి ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటాయని, బలమైన స్క్రీన్‌ప్లే తోడైతే బాక్సాఫిస్ వద్ద కనక వర్షం కురిసేదని చంద్రశేఖర్ తెలిపారు. బీస్ట్ లో లోపాలున్నప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోందని, దానికి కారణం హీరో, డ్యాన్స్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ అని చెప్పుకొచ్చారు. వీరిమధ్యన దర్శకుడు నెల్సన్ పేరు లేకపోవడం వివాదాస్పదంగా మారింది.