బ్రహ్మంగారి మఠంలో ఉద్రిక్తత…ఇదే కారణం…
కడపజిల్లాలోని బ్రహ్మంగారి మఠం కేంద్రంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మఠం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది వ్యక్తులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అధికారుల అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు కొందరు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కడప జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠం నుంచి బ్రహ్మంసాగర్‌కు వెళ్లే మార్గంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పలుమార్లు ప్రయత్నించారు.
ఎమ్మెల్యే, ఎంపీపీల అండదండలు ఉన్నాయని, అధికారుల అనుమతులతో అవసరం లేదని చెప్పి కొందరు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.