మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఆలయం… ఎక్కడంటే…
మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఆలయం నిర్మించబోతున్నారు. తమిళనాడుకు చెందిన వాజ్‌పేయి అభిమానులు మాజీ ప్రధానికి ఆలయం నిర్మించాలని సంకల్పించారు. పుదుకోటై జిల్లా వీరాలిమలై సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మంచనున్నారు.
తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి భారతీయార్ మునిమనువరాలు, బీజేపీ అగ్రనేత ఉమాభారతీతో కలిసి ఈ ఆలయాన్ని శంకుస్థాపన చేశారు. బీజేపీ 42వ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా వాజ్‌పేయికి ఆలయం నిర్మించనున్నారు. దేశంలో రెండు సీట్లతో మొదలుపెట్టి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. వీరాలిమలై సమీపంలో సుమారు 2400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 2 కోట్ల ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.