మళ్లీ తెలంగాణ రాజకీయాల పై ఫోకస్ పెట్టిన చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయలపై ఫోకస్ పెట్టారు..వచ్చే ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించేందుకు పార్టీనేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు..ఈరోజు ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు..ఈ భేటీకి టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, టీడీపీ వ్యవహారాల ఇంచార్జ్ కంభంపాటి రామ్మోహన్, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ ఇతర ముఖ్యనేతలు హజరయ్యారు..
తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు..పార్టీ సంస్థాగత అభివృద్ధి, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు..ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలతో పాటు మే లో హైదరాబాద్ లో జరిగే మినీ మహానాడు విజయవంతం చేయాలని పార్టీ నేతలకు బాబు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఈనెల 22 నుంచి టీడీపీ మెంబర్‌షిప్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశించారు. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలతో పాటు..బలహీనవర్గాల గొంతుకగా పార్టీ ముందుకు వెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని చంద్రబాబు ఆదేశించారు..పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ప్రణాళిలు వేస్తు ముందుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటించారు.