IPL: గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 16 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధావన్ 62 పరుగులతో నిలకడ చూపించగా.. ఆఖర్లో లివింగ్‌స్టోన్ మెరుపు ఇన్నింగ్స్10 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 30 పరుగుల ఆడి పంజాబ్ విజయాన్ని సులువు చేశాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, ఫెర్గూసన్ చెరొక వికెట్ తీశారు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ 48 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 65 పరుగులు నాటౌట్ రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సుదర్శన్ మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. సాహా 21 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ 4 వికెట్లు పడగొట్టాడు.