నేటినుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం…
నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కోటంపల్లి మండలం అర్జున గుట్ట, దేవులవాడ, వేమనపల్లిలోని ప్రాణహిత నదివద్ద ప్రభుత్వం పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వేద పండితుల పూజలమధ్య ప్రాణహిత పుష్కరాలకు అంకురార్పణ జరగనున్నది. ఈరోజు జరిగే ఈ అంకురార్పణ కార్యక్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, బాల్క సుమన్‌లు పాల్గొననున్నారు.
12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నది. పుష్కరాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 13 నుంచి 24 వరకు 12 రోజులపాటు ఆ పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల్లో పాల్గొనే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణహిత పుష్కరాల కోసం వరంగల్, కొమురంభీం, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల నుంచి సుమారు 200 లకు పైగా బస్సులను నడుపుతున్నారు.