ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు నాంపల్లి కోర్టు షాక్… నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ…
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది. మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.
ఓ కేసులో ఇద్దరు ప్రజాప్రతినిధులు కోర్టుకు హాజరుకాలేదు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేస్తు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఇష్యూ చేసింది. ఆ నాన్‌బెయిలబుల్ వారెంట్‌పై ఇద్దరు ప్రజాప్రతినిధులు స్పందించాల్సి ఉన్నది. కాగా, రసమయి బాలకిషన్ ప్రస్తుతం రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మరో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ 2018 వరకు వరంగల్ మేయర్‌గా పనిచేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో వరంగల్ తూర్పునియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.