నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీనామా…
నీతి అయోగ్ వైఎస్ చైర్మన్ పదవికి రాజీవ్‌కుమార్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. హటాత్తుగా రాజీవ్‌కుమార్ రాజీనామా చేయడంతో కొత్త వైఎస్ చైర్మన్‌గా సుమన్ కే బేరీని కేంద్రం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెరీ మే 1 వ తేదీన వైఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. రాజీనామా చేసిన మాజీ వైఎస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగియనున్నది. దీనికి కేవలం కొన్ని రోజుల ముందు ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం విశేషం. అయితే, సడన్‌గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
ఇక ఇదిలా ఉంటే, నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ రాజీనామాను కేంద్రం ఆమోదించింది. ఏప్రిల్ 30 వ తేదీన తన బాధ్యతల నుంచి తప్పుకుంటారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇక నీతి అయోగ్ వైఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న సుమన్ కే బెరీ గతంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ డైరెక్టర్‌గా, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా పనిచేశారు.